Madhya Pradesh Fomers Installed CC Camera On His Field: ఈ మధ్యకాలంలో ప్రతిచోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. దుకాణాలలో, ఇళ్లలో, రోడ్లమీద, ఆలయాల్లో కూడా సీసీ కెమెరాలను పెడుతున్నారు. ఒకప్పుడు బంగారం షాపులు, చోరీలకు గురయ్యే అవకాశం ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ఇవి కన్పించేవి. మరీ ఇప్పుడు.. సీసీ కెమెరాలు లేని ప్రదేశాలు చోట్లు చాలా అరుదుగా మారాయి. గతంలో వెజిటెబుల్స్ ధరలు చుక్కలను తాకాయి.
Read More: Belly fat: బెల్లిఫ్యాట్ తో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ టిప్స్ డైలీ పాటిస్తే వారంలో చెక్ పెట్టేయోచ్చు..
ముఖ్యంగా టమాటాల ధరలు పెరిగినప్పుడు.. కొందరు పొలాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో టమాటా ధరలు.. సెంచరీ దాటి కొన్ని చోట్ల డబులు సెంచరీల వరకు కూడా వెళ్లాయి. అదే విధంగా టమాటాలను పండించిన రైతులు ఓవర్ నైట్ లో కోటీశ్వరులైపోయారు. మరికొందరు టమాటా రైతులు.. ప్రజలను కంట్రోల్ చేయడానికి తమ దుకాణాల దగ్గర బౌన్సర్ లను కూడా నియమించుకున్న సంగతి తెలిసిందే. మరీ కిచెన్ లలో టమాటాలకు ఉన్న డిమాండ్ అలాంటిది.
టమాటాను వండటం ఈజీ. అంతే కాకుండా దీన్ని చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే టమాటాల రేట్లు పెరిగిన కూడా అప్పట్లో జనాలు కొనేందుకు ఎగబడ్డారు. ఇప్పుడు టమాటా బాట లో వెల్లుల్లి వచ్చి చేరింది. కొన్ని రోజులుగా వెల్లూలీ రెట్లు చుక్కలు చూపిస్తున్నాయి. వెల్లుల్లీ కేజీ ధర ఐదువందల వరకు కూడా కొన్ని చోట్ల ఉండటం చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. మరీ అలాంటి వెల్లూల్లీ పంటపొలంలో చోరీలు కాకుండా సదరు రైతులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మరీ నిఘా పెంచారు. ఈ ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు...
మధ్య ప్రదేశ్ లోని ఛింద్వాడా జిల్లాలోని రైతులు వెల్లుల్లీ ని సాగు చేసిన తమ పొలంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అక్కడ మార్కెట్ లో వెల్లుల్లీ రెట్లు ఐదువందల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రైతులు, గజనాన్, రాహుల్ లు తమ పొలంలో వెల్లుల్లిసాగు చేస్తున్నారు. కొన్నిరోజులుగా వెల్లూల్లీ చోరీకి గురౌతున్నట్లు వీరు గమనించారు. పంట సాగు చేశాక, కుప్పల దగ్గర నుంచి రాత్రి రాత్రి వెల్లుల్లీ మాయమౌతున్నాయి. దీంతో ఒక ప్లాన్ వేశారు.
పొలంలో సౌరశక్తితో నడిచే సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా.. పొలంలోకి పనికి వచ్చిన వారిని గమనించడానికి ప్రత్యేకంగా సెక్యురిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పొలంలో ఎవరు కూడా చోరీకి పాల్పడే అవకాశంలేకుండా ఇలా ఐడియా వేశారు. కొన్నిరోజులుగా వీరి చుట్టుపక్కల గ్రామాలలో వెల్లుల్లీ కుప్పలు చోరీ జరిగాయని సమాచారం. వేలాది రూపాయల డబ్బులు ఖర్చులు పెట్టి, కష్టపడి సాగు చేశాక.. చేతికొచ్చిన పంట దొంగల పాలు కావడంతో రైతులు ఆందోళన చెందారు.
Read More: Iswarya Menon: ఎరుపెక్కిన అందాలతో హీటెక్కిస్తున్న ఐశ్వర్య మీనన్, లేటెస్ట్ పిక్స్ వైరల్
అందుకే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు రైతులు తెలిపారు. ఇలా చేసినప్పటి నుంచి పోలంలో చోరీలు అస్సలు జరగలేదని రైతులు చెబుతున్నారు. అస్సలు, పొలంవైపు చూడటానికి సైతం భయపడుతున్నారని గజనాన్ చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. టమాటా రూట్ లో.. వెల్లూలీ వెళ్లిందా.. ? అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook