Covid 19 Vaccination in Goa: దేశంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన రాష్ట్రంగా గోవా నిలిచింది. గోవాలో 18 ఏళ్లు పైబడినవారి జనాభా 11.66 లక్షలు ఉండగా.. బుధవారం (ఫిబ్రవరి 16) నాటికి అర్హులైన అందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయింది. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తవడంతో కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇకనుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక డ్రైవ్ ఏమీ ఉండదని.. సాధారణ వ్యాక్సిన్ల లాగే అన్ని హెల్త్ కేర్ సెంటర్లలో కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని గోవా ఆరోగ్య శాఖ వెల్లడించింది. వంద శాతం వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రంగా గోవాను నిలిపినందుకు హెల్త్ కేర్ సిబ్బందిని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రానే అభినందించారు. గోవాలో వంద శాతం వ్యాక్సినేషన్ కోసం వారు చేసిన కృషి, నిబద్దత అభినందనీయమన్నారు.
వంద శాతం వ్యాక్సినేషన్ అనేది తాము నిర్దేశించుకున్న నంబర్‌కి సంబంధించినదని స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డా.రాజేంద్ర బోర్కర్ తెలిపారు. ఇప్పటికీ కొంతమంది వ్యాక్సిన్ మొదటి డోసు కోసం, రెండో డోసు కోసం వచ్చేవారు ఉంటారని పేర్కొన్నారు. అయితే ఆ సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఇప్పటికీ కొంతమంది వృద్దులు.. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కొందరు వ్యాక్సిన్ తీసుకోలేదని... అలాంటివారు ఇకనైనా వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్ సెంటర్లను మూసివేయట్లేదని.. అయితే వారానికి ఒకరోజు మాత్రమే అక్కడ వ్యాక్సినేషన్ జరుగుతుందని తెలిపారు.
కాగా, గోవాలో బుధవారం (ఫిబ్రవరి 16) కొత్తగా 118 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.44 లక్షలకు చేరింది. ఇప్పటివరకూ కరోనాతో 3782 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,608 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: Son of India: ఆ ఇద్దరు హీరోలే ఇదంతా చేస్తున్నారు.. వారికి శిక్ష తప్పదు! మోహన్ బాబు వార్నింగ్!!
Also Read: Pinky Finger: మీ పింకీ ఫింగర్‌ను చూసి మీరెలాంటి వారో చెప్పొచ్చు.. ఎలాగో తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook