Gold Rate: చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలు!

నేడు బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పెరిగాయి. వెండి ధర సైతం పసిడి దారిలోనే పయనించింది.బులియన్ మార్కెట్ చరిత్రలోనే వెండి నేడు అత్యధిక ధర నమోదు చేసింది.

Updated: Jul 28, 2020, 08:05 AM IST
Gold Rate: చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలు!

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పెరిగాయి. వెండి ధర సైతం పసిడి దారిలోనే పయనించింది. హైదరాబాద్‌ (Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.820 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,300కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.730 పెరగడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.49,780 వద్ద ట్రేడ్ అవుతోంది. ‘రెమ్‌డెసివర్‌’ అక్కడ మాత్రమే విక్రయాలు

ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర భారీగా పెరిగింది. నేటి మార్కెట్‌లో రూ.840 మేర పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,000 కి ఎగసింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,800కి చేరింది. నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు

బులియన్ మార్కెట్ చరిత్రలోనే వెండి నేడు అత్యధిక ధర నమోదు చేసింది. కాగా, నేడు వెండి ధర రూ.3,490 మేర భారీగా పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.64,700కి ఎగసింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది.  బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..   
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్