Gold Rate: భగ్గుమన్న బంగారం ధరలు

కరోనా కష్టకాలమని చూస్తున్నాం. కానీ బంగారం, వెండికి గతంలో ఎన్నడూ లేనంతగా బులియన్ మార్కెట్‌లో వీటి ధరలు (Gold Rate Today In India) పెరిగిపోతున్నాయి. 

Updated: Aug 2, 2020, 07:33 AM IST
Gold Rate: భగ్గుమన్న బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా 12వ రోజు పెరిగాయి. వెండి ధర సైతం బంగారాన్ని అనుసరించింది. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.530 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,490కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్లపై అంతే పెరగడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.51,780కి పెరిగింది. మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి

దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold price in Delhi) ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న సాయంత్రానికి మార్కెట్‌లో రూ.250 మేర ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,200 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.50 పెరగడంతో ధర రూ.52,250కి చేరింది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) కేజీకి రూ.110 మేర పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.65,110కి ఎగసింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో కొనసాగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్..