Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. వెండి భారీగా పతనం

కరోనా వ్యాప్తి నేపథ్యంలోోనూ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు తాజాగా దిగొస్తున్నాయి. ఒక్కసారి బంగారం, వెండి ధరలు భారీగా పతనం కావడం కొనుగోలుదారులకు కాస్త ఊరట ఇస్తుంది. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు ఇందుకు కారణం.

Updated: Sep 23, 2020, 07:18 AM IST
Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. వెండి భారీగా పతనం

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Price Today), వరుసగా రెండోరోజు తగ్గాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా క్షీణించింది. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.590 మేర భారీగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,230 అయింది.  అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,800కి పతనమైంది. 

దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధర (Gold Rate in Delhi) రెండోరోజు ధరలు క్షీణించాయి. తాజాగా రూ.760 మేర భారీగా ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,000కి దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.700 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.49,500కి పతనమైంది. 

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) వరుసగా నాలుగోరోజు భారీగా దిగొచ్చింది. తాజాగా ఏకంగా రూ.6,400 మేర వెండి ధర తగ్గింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.60,600కి ధర పతనమైంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద మార్కెట్ అవుతుంది.

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe