Gold Price In Hyderabad: మళ్లీ పెరిగిన బంగారం ధరలు, షాకిచ్చిన వెండి

బంగారు కొనుగోలుదారులకు వరుసగా మూడోరోజు చేదువార్త. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Price In Hyderabad) రోజురోజుకు పెరుగుతున్నాయి. వెండి ధర భారీగా పెరిగి షాకిచ్చింది. జాతీయ, పలు అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి.

Last Updated : Sep 2, 2020, 07:31 AM IST
  • భారీగా పెరిగిన ధరలతో బులియన్ మార్కెట్ ధగధగలు
  • వరుసగా మూడోరోజు పెరిగిన బంగారం ధరలు
  • ఏకంగా రూ.2100 పెరిగి షాకిచ్చిన వెండి ధర
  • బంగారు కొనుగోలుదారులకు మరోసారి చేదువార్త
Gold Price In Hyderabad: మళ్లీ పెరిగిన బంగారం ధరలు, షాకిచ్చిన వెండి

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా మూడోరోజు పెరిగాయి. వెండి ధరలు సైతం బంగారం బాటలోనే నడిచాయి. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.160 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,200కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల ధర రూ.49,720 అయింది. SS Rjamouli: యాంటీ బాడీస్ డొనేట్ చేసిన కీరవాణి.. తనకు వీలుకాలేదన్న రాజమౌళి 
Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) వరుసగా నాలుగోరోజు పెరిగాయి. తాజాగా రూ.70 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,000కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.50 పెరగడంతో ధర రూ.50,400 అయింది.  Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) వరుసగా ఐదోరోజూ దూసుకెళ్తోంది. తాజాగా రూ.2100 మేర భారీగా పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.68,700కి చేరింది. వెండి దేశ వ్యాప్తంగా ఇదే ధర ఉంటుంది. Photos: ఘనంగా గౌతమ్ పుట్టినరోజు వేడుక 
Khatron Ke Khiladi టైటిల్ విన్నర్, నటి నియా శర్మ ఫొటో గ్యాలరీ

 

Trending News