బంగారం భగభగలు.. వెండి ధరలకు రెక్కలు

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పోటీపడుతున్నాయి. బంగారం ధరలకు వెండి ధరలు షాకిస్తున్నాయి. రికార్డు ధరలు నమోదు చేసి వ్యాపారులకు లాభాలను, కస్టమర్లకు కాస్త ఇబ్బంది కలిగిస్తున్నాయి.

Shankar Dukanam Shankar Dukanam | Updated: Jun 2, 2020, 06:51 AM IST
బంగారం భగభగలు.. వెండి ధరలకు రెక్కలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా మూడోరోజూ పెరిగాయి. అయితే బంగారం ధరలు మార్కెట్లో ఆల్‌టైమ్ రికార్డు ధరలు నమోదు చేయడం విశేషం. వెండి సైతం బంగారం దారిలోనే పయనించి రికార్డు ధరలకు ఎగబాకింది. దేశీయ కొనుగోళ్లు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి.  LockDown5.0పై కడుపుబ్బా నవ్వించే జోక్స్

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.10 మేర అతి స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,160కి ఎగసింది. అయితే బులియన్ మార్కెట్‌లో ఇప్పటివరకూ ఇదే రికార్డు ధర కావడం గమనార్హం. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,090కి చేరుకుంది. జూన్ నెలలో బ్యాంకు సెలవులు ఇవే..

ఢిల్లీ మార్కెట్‌లోనూ నేడు వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. నిన్న రూ.200 మేర పెరిగిన బంగారం ధర నేడు రూ.10 మేర అతి స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,510కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,710కి ఎగసింది.  బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!

వెండి సైతం బంగారం దారిలో పయనిస్తూ ఆల్ టైమ్ గరిష్ట ధరలను నమోదు చేసింది. బులియన్ మార్కెట్‌లో నేడు వరుసగా నాలుగోరోజూ వెండి ధర పెరిగింది. నేటి మార్కెట్‌లో రూ.10 మేర అతి స్వల్పంగా ధర పెరగడంతో 1 కేజీ వెండి ధర ధర రూ.50,110కి ఎగసింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి