తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమన్న బంగారం ధరలు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో దేశ రాజధాని ఢిల్లీ కన్నా అధికంగా బంగారం, వెండి ధరలు నమోదవుతున్నాయి. డిమాండ్‌ అధికం కావడంతో ధరలను బులియన్‌ మార్కెట్‌ ఆల్‌టైమ్‌ రికార్డు ధరలను చూస్తోంది.

Shankar Dukanam Shankar Dukanam | Updated: Jun 3, 2020, 07:56 AM IST
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమన్న బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా నాలుగోరోజూ పెరిగాయి. అయితే బంగారం ధరలు మార్కెట్లో ఆల్‌టైమ్ రికార్డు ధరలు నమోదు చేయడం విశేషం. వెండి సైతం బంగారం దారిలోనే పయనించి రికార్డు ధరలకు ఎగబాకింది. దేశీయ కొనుగోళ్లు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి.  జూన్ నెలలో బ్యాంకు సెలవులు ఇవే..

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.60 మేర అతి స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,220కి ఎగసింది. అయితే బులియన్ మార్కెట్‌లో ఇప్పటివరకూ ఇదే అత్యధిక ధర. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.30 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.45,120కి చేరింది. LockDown5.0పై కడుపుబ్బా నవ్వించే జోక్స్

ఢిల్లీ మార్కెట్‌లోనూ నేడు వరుసగా మూడోరోజు బంగారం ధరలు పెరిగాయి. నిన్న రూ.10 మేర అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధర నేడు రూ.190 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,700కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,900కి ఎగసింది. 

బంగారం రికార్డు ధరలకు ఎగబాకగా, వెండి సైతం బంగారం దారిలో పయనించింది. బులియన్ మార్కెట్‌లో నేడు వరుసగా ఐదోరోజూ వెండి ధర పెరిగింది. నేటి మార్కెట్‌లో రూ.40 మేర అతి స్వల్పంగా ధర పెరగడంతో 1 కేజీ వెండి ధర ధర రూ.50,150కి చేరుకుని ఆల్‌ టైమ్‌ గరిష్టానికి చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద కొనసాగుతోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి