5 Day Week: బ్యాంకులకు 5 రోజుల పనిదినాలు ఎప్పట్నించే తెలుసా

5 Day Week: బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్. త్వరలోనే వారానికి ఐదు రోజులు పని దినాలు ప్రారంభం కానున్నాయి. బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అంశమిది. 5 డే వీక్ ఎప్పట్నించి ప్రారంభం కావచ్చో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 16, 2024, 06:52 PM IST
5 Day Week: బ్యాంకులకు 5 రోజుల పనిదినాలు ఎప్పట్నించే తెలుసా

5 Day Week: దేశంలోని బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పనిదినాలపై చర్చ మరోసారి ప్రారంభమైంది. ప్రస్తుతం బ్యాంకులు వారానికి ఆరు రోజులు పనిచేస్తున్నా...రెండు, నాలుగు శనివారాలు సెలవులున్నాయి. అంటే వారానికి ఐదు రోజులు మొదలైతే నెలలో మరో రెండు లేదా మూడు రోజులు అదనంగా సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. 

బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పనిదినాలనేది దేశంలోని బ్యాంకు ఉద్యోగుల్లో చాలా కాలంగా ఉన్న డిమాండ్. రెండు, నాలుగవ శని వారాలు, నాలుగు ఆదివారాల సెలవులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. అంటే 5 డే వీక్ ప్రారంభమైతే అదనంగా మరో రెండు మూడు రోజులు సెలవులుంటాయి. వీక్లీ 5 డేస్ కోసం బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఈ నెలలో అంటే డిసెంబర్ 2024 నుంచి అమల్లో వస్తుందని అంతా భావించారు. కానీ కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి ఆమోదం లభించకపోవడంతో ఇంకా పెండింగులో పడింది. ఉద్యోగులంతా ఎప్పుడెప్పుడు ప్రారంభమౌతుందా అని చూస్తున్నారు.

ఇప్పటికే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ చాలాసార్లు 5 డేస్ వీక్ కోసం విజ్ఞప్తి చేశాయి. గ్లోబల్ బ్యాంకింగ్ రూల్స్ అనుగుణంగా ఈ ప్రతిపాదన చేరింది. ఉద్యోగుల ప్రయోజనార్ధం ఈ 5 డేస్ వీక్ ప్రతిపాదన అమలు కానుంది. ఒకవేళ బ్యాంకులకు 5 డేస్ వీక్ ప్రారంభమైతే కస్టమర్లు బ్యాంకు పని ఉంటే అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవల్సి ఉంటుంది. అయితే ఉద్యోగుల పని వేళలు మారుతాయి. రోజుకు 40 నిమిషాల పని వేళ పెరుగుతుంది.

వారానికి 5 రోజుల పనిదినాలు ప్రారంభం కావాలంటే ముందుగా ఆర్బీఐ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత కేంద్ర ఆర్ధిక శాఖ ఆమోదం లభించాలి. బ్యాంకు సేవల్లో అంతరాయం కలగకుండా చూడటం అనేది అతిపెద్ద సవాలు. అందుకే 5 డే వీక్ ఇంకా ఆమోం పొందలేదు. పవివేళలు, జీతం ఇతర సేవల విషయంలో ఉద్యోగులు, యాజమాన్యం మధ్య ఏకాభిప్రాయం రావల్సి ఉంటుంది. 

ఇతర దేశాల్లో అంటే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో ఇప్పటికే బ్యాంకులకు 5 రోజుల పనిదినాలున్నాయి. అందుకే ఇండియాలో కూడా ఈ పద్ధతి అమలు చేయాలనే ఆలోచన ఉంది. ఉద్యోగులు ఎదురుచూస్తున్న 5 డేస్ వీక్ త్వరలో అంటే ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన ఉండవచ్చు.

Also read: Vitamin D Supplements: విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఎంతకాలం తీసుకోవాలి, బెస్ట్ డైట్ ఏంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News