Happy Friendship Day 2022: ఇవాళ స్నేహితుల దినోత్సవం... ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యత ఇదే.. ఈ కొటేషన్స్‌తో మీ స్నేహితులకు విష్ చేయండి..

Happy Friendship Day 2022: ఇవాళ స్నేహితుల దినోత్సవం. మీనింగ్‌ఫుల్ కొటేషన్స్, బ్యూటిఫుల్ ఫ్రెండ్‌షిప్ సాంగ్స్‌ను మీ స్నేహితులకు డెడికేట్ చేయండి.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 7, 2022, 09:00 AM IST
  • హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే 2022
  • ఇవాళ స్నేహితుల దినోత్సవం
  • ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా
Happy Friendship Day 2022: ఇవాళ స్నేహితుల దినోత్సవం... ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యత ఇదే.. ఈ కొటేషన్స్‌తో మీ స్నేహితులకు విష్ చేయండి..

Happy Friendship Day 2022: ఇవాళ స్నేహితుల దినోత్సవం. ప్రతీ ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. నిజానికి ఐక్యరాజ్య సమితి జూలై 30న వరల్డ్ ఫ్రెండ్‌షిప్ డేగా ప్రకటించింది. అయినప్పటికీ ఇండియా సహా కొన్ని దేశాల్లో ఆగస్టు మొదటి ఆదివారం రోజునే స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈరోజుకు ఉన్న ప్రాధాన్యత, చరిత్ర, తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఫ్రెండ్‌షిప్ డే చరిత్ర :

అమెరికాకు చెందిన జాయిస్ హాల్ అనే హాల్‌మార్క్ కార్డ్స్ వ్యాపారి 1930లో తొలిసారిగా ఫ్రెండ్‌షిప్ డే ప్రతిపాదన తీసుకొచ్చినట్లు చెబుతారు. ఆగస్టు 2న ఫ్రెండ్‌షిప్ డే నిర్వహించాలని జాయిస్ హాల్ మార్క్ ప్రతిపాదించాడు. అయితే తన గ్రీటింగ్ కార్డులు అమ్ముకోవచ్చుననే వ్యాపార దృక్పథంతోనే జాయిస్ హాల్ ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నాడనే ప్రచారం అప్పట్లో జరిగింది. దీంతో చాలామంది అతని ప్రతిపాదనను పట్టించుకోలేదు. 

ఆ తర్వాతి కాలంలో పురుడు పోసుకున్న వరల్డ్ ఫ్రెండ్‌షిప్ క్రూసేడ్ ప్రతీ ఏటా జూలై 30న వరల్డ్ ఫ్రెండ్‌షిప్ డే నిర్వహించాలని ఐక్యరాజ్య సమితిని కోరింది. 2011లో ఐరాస జూలై 30వ తేదీని వరల్డ్ ఫ్రెండ్‌షిప్‌ డేగా అధికారికంగా ప్రకటించింది. కానీ ఇండియా సహా పలు దేశాలు మాత్రం ఆగస్టు మొదటి ఆదివారాన్నే ఫ్రెండ్ షిప్ డేగా జరుపుకుంటున్నాయి. 

ఫ్రెండ్‌షిప్ డే ప్రాముఖ్యత ఇదే :

ఫ్రెండ్ షిప్ డేపై బోలెడంత సినీ సాహిత్యం ఉంది. స్నేహం గొప్పతనాన్ని వివరిస్తూ అన్ని భాషల్లో ఎన్నో పాటలు వచ్చాయి. జీవితంలో కష్టనష్టాల్లో తోడుంటే స్నేహితులను తలుచుకోవడం, వారితో గడిపేందుకు ప్రత్యేకంగా ఒకరోజును కేటాయించడమే ఫ్రెండ్‌షిప్‌ డేకి ఉన్న ప్రాధాన్యత. స్నేహితుని ద్వారా ఏదైనా మేలు పొందినట్లే ఫ్రెండ్‌షిప్ డే నాడు అందుకు కృతజ్ఞతగా వారికి ఏవైనా కానుకలు, గ్రీటింగ్ కార్డ్స్ లాంటివి ఇస్తుంటారు.

ఫ్రెండ్‌షిప్ డే కొటేషన్స్ :

ప్రతీ స్నేహం మనలో ఓ కొత్త ప్రపంచాన్ని ఉదయింపజేస్తుంది. ఆ స్నేహం పొందేవరకూ ఆ ప్రపంచం మనలో ఉన్నట్లు మనకూ తెలియదు.

కొన్ని స్నేహాలు జీవితంపై చెరిగిపోని ముద్ర వేస్తాయి. ఆ స్నేహం లేకుండా జీవితాన్ని ఊహించుకోలేం.

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే.. మన స్నేహం కలకాలం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.

ఈ ప్రపంచంలో ఏ దూరం మనల్ని విడదీయలేదు. ఎందుకంటే మన స్నేహ బంధం అంత బలమైనది, శాశ్వతమైనది. లవ్ యూ డియర్. హ్యాపీ ఫ్రెండ్ ‌షిప్ డే.

ఇలాంటి కొటేషన్లను టెక్స్ట్ మెసేజ్‌లుగా పంపడం ద్వారా లేదా వాట్సాప్, ఫేస్‌బుక్ స్టేటస్‌లుగా పెట్టుకోవడం ద్వారా మీ స్నేహితులకు ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు చెప్పవచ్చు. ఈ ఫ్రెండ్‌షిప్ డేని మీరూ మీ స్నేహితులతో కలిసి సంతోషంగా జరుపుకోండి. 

Also Read: CWG 2022: చరిత్ర సృష్టించిన భవినా పటేల్.. మొదటి క్రీడాకారిణిగా!

Also Read: India vs West Indies: నాలుగో టీ20లో విండీస్‌పై భారత్‌ విజయం.. సిరీస్‌ సొంతం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News