2019లో మోదీ మళ్లీ ప్రధాని అయితే, ఆ తర్వాత దేశంలో ఇక ఎన్నికలే ఉండవు : హార్థిక్ పటేల్

సన్నిలియోన్‌ని వెనకేసుకొచ్చిన హార్థిక్ పటేల్

Last Updated : Jun 12, 2018, 12:21 PM IST
2019లో మోదీ మళ్లీ ప్రధాని అయితే, ఆ తర్వాత దేశంలో ఇక ఎన్నికలే ఉండవు : హార్థిక్ పటేల్

గుజరాత్‌లో పటిదార్ ఉద్యమాన్ని తీసుకొచ్చి పటేల్ సామాజిక వర్గం నాయకుడిగా ఎదిగిన హార్థిక్ పటేల్ ఓవైపు బాలీవుడ్ తార సన్నిలియోన్‌ని వెనకేసుకొస్తూనే మరోవైపు బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. బాలీవుడ్‌లో నర్గీస్, శ్రీదేవి, మాధురి దీక్షిత్ వంటి స్టార్ హీరోయిన్స్‌ని చూసినట్టుగా సన్నిలియోన్‌ని వారితో సమానంగా ఎందుకు చూడలేకపోతున్నారని హార్థిక్ పటేల్ సందేహం వ్యక్తంచేశారు. సన్నిలియోన్‌కు గతంలో ఉన్న పోర్న్ స్టార్ ఇమేజ్‌ని పక్కనపెట్టి, ఆమెను నటిగా ఆదరించకపోతే, దేశంలో ఇక మార్పు ఎలా సాధ్యపడుతుందని హార్థిక్ పటేల్ ప్రశ్నించారు. ఇండోర్‌లో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మీడియాతో మాట్లాడుతు హార్థిక్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో చేపట్టనున్న యాత్ర గురించి ప్రకటన చేయడం కోసం ఇండోర్ వెళ్లిన సందర్భంలో హార్థిక్ పటేల్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై ఎప్పటిలాగే తనదైన శైలిలో ఆరోపణలు గుప్పించారు. 

భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీ గురించి హార్థిక్ పటేల్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లోనూ ఒకవేళ బీజేపీనే గెలిచి నరేంద్ర మోదీనే దేశ ప్రధాని అయినట్టయితే, ఆ తర్వాత ఇక దేశంలో ఎన్నికలు అనేవే ఉండవు అని మోదీ పాలనను తనదైన స్టైల్లో విమర్శించారు. ఏ ప్రాతిపదికన మోదీపై అలాంటి విమర్శలు చేస్తారని అక్కడున్న మీడియా అడిగిన ప్రశ్నకు హార్థిక్ స్పందిస్తూ... కర్ణాటకలో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనన్ని స్థానాలు లేనప్పటికీ ఆ రాష్ట్ర గవర్నర్ బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించిన తీరు చూస్తే, ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనుసరిస్తున్న తీరు ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. అంతకన్నా ఇంక వేరే ఉదాహరణలు ఏం కావాలి అని అన్నారు. 

Trending News