Krishna River Floods: కృష్ణా నది మహోగ్రరూపం, 125 ఏళ్ల చరిత్రలో భారీగా వరద నీరు

Krishna River Floods: కృష్ణా నది మహోగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ వరద ప్రవాహంతో పోటెత్తుతోంది. వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. కృష్ణా నది ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 2, 2024, 01:48 PM IST
Krishna River Floods: కృష్ణా నది మహోగ్రరూపం, 125 ఏళ్ల చరిత్రలో భారీగా వరద నీరు

Krishna River Floods: కృష్ణా నది వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత భారీ వరద వచ్చి పడుతోంది. ప్రస్తుతం కృష్ణా నదిలో 11 లక్షల క్యూసెక్కులు దాటి వరద ప్రవహిస్తోంది. సాయంత్రం వరకు మరింత పెరగవచ్చని తెలుస్తోంది.

భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో భారీగా వరద వచ్చి చేరుతోంది. వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. ప్రస్తుతం కృష్ణా నదిలో 11 లక్షల 40 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. 2009వ సంవత్సరంలో అక్టోబర్ 5న రికార్డు స్థాయిలో 10 లక్షల 94 వేల క్యూసెక్కులు నీరు ప్రవహిస్తోంది. అంతకంటే ముందు 1903 అక్టోబర్ నెలలో 10 లక్షల 60 వేల క్యూసెక్కులు నీరు ప్రవహించింది. వరద ప్రవాహంతో కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. 

బుడమేరుకు గండిపడటంతో సింగ్ నగర్, ఊర్మిలా నగర్, ప్రకాశ్ నగర్, వాంబే కోలనీ, ఖండ్రిగ, పైపుల రోడ్, న్యూ రాజరాజేశ్వరి పేట, వైఎస్సార్ కాలనీ, జక్కంపూడి కాలనీలు ఇప్పటికీ వరద ముంపులో ఉన్నాయి. కృష్ణా నదీ ప్రవాహం కృష్ణ లంక రైల్వై వంతెనను తాకుతోంది. 

మరోవైపు కృష్ణా నది వరదలపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. వరద ఇంకా పెరిగితే చేతులెత్తేయాల్సిందేనన్నారు. ప్రస్తుతం గరిష్ట స్థాయిలో ప్రవహిస్తోందన్నారు. బ్యారేజ్ మూడు గేట్లు దెబ్బతినడంతో పరిస్థితి మరింత విషమించిందన్నారు. 

Also read: Krishna Floods: ఇంకా వరద ముప్పులోనే విజయవాడ, ఉగ్రరూపం దాలుస్తున్న కృష్ణమ్మ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News