దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉన్న ఐజీఎస్టీ నిధులను(IGST funds) కేంద్రం విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన రూ.35,298 కోట్ల నిధులలో భాగంగానే తెలంగాణకు రావాల్సి ఉన్న రూ.1,036 కోట్లను సైతం విడుదల చేసినట్టు కేంద్రం ప్రకటించింది.
మేక్ ఇన్ ఇండియా.. కాదు రేప్ ఇన్ ఇండియా అని తాను చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ డిమాండ్‌కు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ చేసిన ''మేక్ ఇన్ ఇండియా - రేప్ ఇన్ ఇండియా'' వ్యాఖ్యలు పార్లమెంట్లో దుమారం రేపుతున్నాయి. నిన్న ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ దేశంలో 'మేక్ ఇన్ ఇండియా'కు బదులు 'రేప్ ఇన్ ఇండియా' అన్నట్లుగా పరిస్థితి తయారైందని మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎన్డిఏ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు చట్టం 2019 ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో అస్సాంలో ఆందోళనకారులు రోడ్డెక్కి ఉద్యమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల్లో భాగంగా అస్సాంలో పలుచోట్ల విధ్వంసకరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.
అస్సాం రాజధాని గౌహతిలో కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఉద్యమాలు చేపట్టారు. ఐతే వారిని అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనకారులు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
పౌరసత్వ సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు పలకడం నిరాశకు గురి చేసిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సలహాదారుడు ప్రశాంత్ కిశోర్ అన్నారు. రాజ్యాంగంలోని మొదటి పేజీలోనే మూడు సార్లు లౌకికవాదం అనే పదం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఉల్లి ధరలు కోయకుండానే సామాన్య మానవుడికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇదే విషయమై పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద అన్నీ పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పార్లమెంట్ సభ్యులు తమ నిరసన తెలియజేశారు.
ఉల్లిగడ్డల ధరల పెరుగుదల వెనుక కేంద్ర ప్రభుత్వం భారీ కుంభకోణం దాగి ఉందని సంజయ్ సింగ్ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మంగళవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఉల్లిగడ్డల మాల ధరించి పెరుగుతున్న ఉల్లి ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 7 లక్షల ఉద్యోగాలు(Central govt jobs) ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్(Union minister Jitendra Singh) వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.