ప్రపంచం చూపు భారత్ వైపు.. ఆ ఔషధం కోసమేనా...

కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితిలో మలేరియా చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధం కోసం భారతదేశాన్ని డిమాండ్ చేస్తున్నాయి.   

Last Updated : Apr 6, 2020, 09:32 PM IST
ప్రపంచం చూపు భారత్ వైపు.. ఆ ఔషధం కోసమేనా...

న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితిలో మలేరియా చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధం కోసం భారతదేశాన్ని డిమాండ్ చేస్తున్నాయి. 

నివేదికల ప్రకారం కోవిడ్ 19 సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఎపిఐల స్టాక్ (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్) దేశీయ అవసరాలను సమీక్షించి నివేదికను సమర్పించాలని మంత్రిత్వ శాఖను కోరింది. కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ముఖ్యమైన సమావేశంలో ఆదివారం చర్చలు జరిగాయి.

భారతదేశ ప్రజల ప్రయోజనాల ప్రాముఖ్యత దౌత్య సంబంధాలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని అధికార వర్గాలు తెలిపాయి. గత వారం ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్ల అవసరాన్ని ప్రస్తావిచారని తెలిపారు. ఈ ట్యాబ్లెట్లకు సంబంధించిన అవసరాన్ని అమెరికా, బ్రెజిల్ ఇతర యూరోపియన్ దేశాలు డిమాండ్ చేశాయని తెలిపారు.  

ఇదిలావుండగా, పాకిస్తాన్ మినహా సార్క్ దేశాల నుంచి ఈ ఔషధాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వం ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. మలేరియా ఔషధ చికిత్సకు భారతదేశం సహాయం కోరుతూ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ (సార్క్) సభ్యులు కూడా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

 

Trending News