Biparjoy Update: అలర్ట్.. రానున్న 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్న బిపార్జోయ్‌ తుఫాన్..!

Biparjoy Cyclone: వచ్చే 24 గంటల్లో బిపార్జోయ్‌ తుఫాన్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు కేరళలోని పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 10, 2023, 03:49 PM IST
Biparjoy Update: అలర్ట్..  రానున్న 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్న బిపార్జోయ్‌ తుఫాన్..!

Biparjoy Cyclone Update: రానున్న 24 గంటల్లో బిపార్జోయ్‌ తుఫాన్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇది ఉత్తరం నుండి ఈశాన్య దిశగా కదులుతున్నట్లు స్పష్టం చేసింది. తుఫాను నేపథ్యంలో..అరేబియా సముద్ర తీరంలోని వల్సాద్‌లోని తితాల్ బీచ్ వద్ద అలలు ఎగసిపడుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. జూన్ 14 వరకు తితాల్ బీచ్‌ను మూసివేశారు అధికారులు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వల్సాద్‌ తహసీల్దార్‌ టీసీ పటేల్‌ తెలిపారు. అవసరమైతే సముద్రం ఒడ్డున ఉన్న ప్రజలను  వేరే ప్రాంతాలకు తరలించి షెల్టర్లు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. 

తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో తీవ్ర తుఫానుగా మారిన బిపార్జోయ్ ఈశాన్య దిశగా దిశగా కదులుతుంది. ఇది గోవాకు పశ్చిమాన 740 కి.మీ, ముంబైకి పశ్చిమ-నైరుతి దిశలో 750 కి.మీ, పోర్ బందర్‌కు పశ్చిమ-నైరుతి దిశలో 760 కి.మీల దూరంలో ఉందని ఐఎండీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సైక్లోన్ రాబోయే మూడు రోజుల్లో ఉత్తర-ఈశాన్య మరియు ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ తుపాన్ రాబోయే 24 గంటల్లో మరింత బలపడనుంది. 

తుఫాన్ నేపథ్యంలో... జూన్ 10న సౌరాష్ట్ర మరియు కచ్ తీర ప్రాంతాల్లో గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జూన్ 11న 60 కిమీ వేగంతోనూ, జూన్ 12న 65 కిమీ వేగంతోనూ, జూన్ 13, 14 తేదీల్లో 70 కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీస్తాయని పేర్కొంది. 

Also Read: Sharad Pawar Threatened: శరద్ పవార్‌కు ప్రాణ హాని, చంపేస్తామంటూ కూతురికి వాట్సప్ బెదిరింపు

కేరళలో ఎల్లో అలర్ట్‌ 
బిపార్జోయ్ తుఫాను తీవ్రరూపం దాల్చనున్న దృష్ట్యా.. కేరళ, కర్ణాటక, లక్షద్వీప్‌ తీరాలలోని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. కేరళలోని తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, కోజికోడ్‌, కన్నూర్‌లలో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. 

Also Read: Rs 2,000 Notes: రూ. 2 వేల నోట్లు ఎన్ని లక్షల కోట్లు వెనక్కి వచ్చాయంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News