ప్రపంచవ్యాప్తంగా 'కరోనా వైరస్' కరాళ నృత్యం చేస్తోంది. 'కరోనా' దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణుకుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా 16 వేల 508 మంది మృతి చెందారు. బాధితుల సంఖ్య 2 లక్షలు దాటేసింది. భారత దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 వందలకు దాదాపు చేరువలో వెళ్లింది. ఇప్పటి వరకు ఇండియాలో కరోనా కారణంగా 9 మంది మృతి చెందారు.
సాయానికి 'సై' అంటున్న హీరో నితిన్
'కరోనా వైరస్'ను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. దీంతో చాలా ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేస్తున్నారు. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేస్తున్నారు. రైళ్లు, బస్సులు, విమాన ప్రయాణాలు అన్నీ బంద్ చేశారు. చివరకు ఓలా, ఊబర్ లాంటి క్యాబ్ లు కూడా బంద్ అయిపోయాయి. మొత్తంగా గుంపులుగా మనుషులు తిరిగే స్థాయి తగ్గిపోయింది. దీంతో కరోనా వైరస్ కు బ్రేక్ పడుతుందని చెబుతున్నారు.
ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో అలాగే జరిగింది. గత 24 గంటల్లో ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అంతే కాదు ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో కరోనా వైరస్ కు చికిత్స తీసుకుంటున్న ఐదుగురు వ్యక్తులను డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..