Ajit Pawar: మహా డిప్యూటీ సీఎం రూ.1000కోట్ల ఆస్తుల జప్తు

Maharashtra Deputy Chief Minister Ajit Pawar: ముంబైలోని నారిమన్‌ పాయింట్‌లోని నిర్మల్‌ టవర్‌తో (Nirmal Tower in Nariman Point),పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాల్లో అజిత్‌ పవార్‌ కు సంబంధించిన పలు ఆస్తులను ఐటీ శాఖ అధికారులు అటాచ్‌ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2021, 05:00 PM IST
  • మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌కు ఆదాయపు పన్నుశాఖ షాక్
  • దాదాపు రూ.1000కోట్ల విలువైన ఆస్తుల జప్తు
Ajit Pawar: మహా డిప్యూటీ సీఎం రూ.1000కోట్ల ఆస్తుల జప్తు

Income Tax department Dept attaches assets worth Rs 1000 crore linked to Maharashtra Deputy Chief Minister Ajit Pawar: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌కు ఆదాయపు పన్నుశాఖ షాకిచ్చింది. అజిత్‌ పవార్‌ కు సంబంధించిన దాదాపు రూ.1000కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసింది. ముంబైలోని నారిమన్‌ పాయింట్‌లోని నిర్మల్‌ టవర్‌తో (Nirmal Tower in Nariman Point),పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాల్లో అజిత్‌ పవార్‌ కు సంబంధించిన పలు ఆస్తులను ఐటీ శాఖ అధికారులు అటాచ్‌ చేశారు. అజిత్‌ పవార్‌ కుటుంబానికి (Ajit Pawar family) చెందిన కో-ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీతో పాటు దక్షిణ ఢిల్లీలో రూ.20కోట్ల విలువ చేసే ఫ్లాట్‌, నిర్మల్‌ టవర్‌లో (Nirmal Tower) రూ. 25కోట్ల విలువ చేసే అజిత్‌ కుమారుడు పార్థ్‌ పవార్‌ కు (Parth Pawar) సంబంధించిన ఆఫీసు, రూ.600 కోట్ల విలువైన షుగర్‌ ఫ్యాక్టరీ, గోవాలో ఓ రిసార్టును అధికారులు అటాచ్‌ చేశారు.

Also Read : Huzurabad By Election Result Live Counting: గెలుపు దిశగా బీజేపీ..13,195 ఓట్ల మెజారిటీతో ఈటెల 

ఈ ఆస్తులన్నీ అజిత్‌తోపాటు ఆయన కుటుంబీకులకు సంబంధించినవిగా చెబుతున్నారు. ఈ ప్రాపర్టీలను తన అక్రమార్జనతో బినామీ (Benami) పేర్ల మీద కొనలేదని 90 రోజుల్లోగా అజిత్ పవార్‌ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒకటి తేలేవరకు ఈ ఆస్తులను అక్రమంగా సంపాదించినట్లుగానే ఐటీ శాఖ పరిగణిస్తుంది. ఈ కేసులో ఐటీ శాఖ విచారణ పూర్తయ్యేదాకా అజిత్ పవార్ తన ఆస్తులను విక్రయించడానికి వీల్లేదు.

ఇక పన్ను ఎగవేత ఆరోపణలపై ఇటీవల అజిత్​ పవార్​ బంధువుల నివాసాలు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ (Income Tax department) దాడులు జరిపింది. ముంబై, పుణె, సతారా సహా మహారాష్ట్ర, గోవాలోని మరికొన్ని నగరాల్లో ఐటీశాఖ దాడులు చేపట్టింది. డీబీ రియాల్టీ, శివాలిక్, జరండేశ్వర్ సాఖర్ షుగర్ కార్ఖానా (జరండేశ్వర్ ఎస్​ఎస్​కే), పవార్​ (Pawar) సోదరీమణుల వ్యాపార సముదాయాల్లో ఈ సోదాలు జరిగాయి. గ‌త వారం అజిత్ ప‌వార్ (Ajit Pawar) బంధువుల‌కు చెందిన‌విగా భావిస్తున్న రెండు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార సంస్ధ‌ల‌పై ఐటీ అధికారులు చేప‌ట్టిన దాడుల్లో రూ 184 కోట్ల లెక్క‌తేల‌ని ఆదాయాన్ని గుర్తించారు.

Also Read : Huzurabad by-poll result live updates: ఈటల రాజేందర్‌కి ఏయే ఎన్నికల్లో ఎంత మెజార్టీ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News