Income Tax Notice: తండ్రీ కొడుకులు భార్యాభర్తల లావాదేవీలపై నోటీసులు వస్తాయా

Income Tax Notice: ఇన్‌కంటాక్స్ శాఖతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచూ చేసే లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు అందుకోవల్సి వస్తుంది. అదే సమయంలో తండ్రీ కొడుకుల మధ్య, భార్యా భర్తల మధ్య జరిగే లావాదేవీలకు కూడా నోటీసులు అందుతాయా లేదా అనేది తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 25, 2024, 12:34 PM IST
Income Tax Notice: తండ్రీ కొడుకులు భార్యాభర్తల లావాదేవీలపై నోటీసులు వస్తాయా

Income Tax Notice: నగదు లావాదేవీల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. పరిమితి దాటి లావాదేవీలు జరిపితే ఇన్‌కంటాక్స్ శాఖ నోటీసులు జారీ చేస్తుంది. ఈ విషయంలో చాలామందికి చాలా సందేహాలు వస్తుంటాయి. నగదు లావాదేవీలపై ట్యాక్స్ ఉంటుందా లేదా, నోటీసులు ఎప్పుడు అందుతాయి, తండ్రీ కొడుకులు, భార్యా భర్తల మధ్య లావాదేవీలపై ట్యాక్స్ ఉంటుందా లేదా అనే ప్రశ్నలకు సమాదానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

తండ్రీ కొడుకులు, భార్యాభర్తల మధ్య లావాదేవీల విషయంలో చాలమందికి తరచూ సందేహాలు ఉంటాయి. ఎందుకంటే ఈ లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి. ఇన్‌కంటాక్స్ శాఖ వీటిపై దృష్టి సారిస్తుంటుంది. అదే సమయంలో వీటిపై ట్యాక్స్ ఉంటుందా లేదా అనేది పరిశీలించాలి. ఒకే కుటుంబంలో ఎంత వరకు నగదు లావాదేవీలు జరపవచ్చు, పరిమితి ఏదైనా ఉందా లేదా అనేది పరిశీలిద్దాం. ఇంటి ఖర్చులు లేదా బహుమతిగా భార్యకు ప్రతి నెలా ఇచ్చే నగదుపై ఆ భార్యకు ట్యాక్స్ ఉండదు. ఎందుకంటే ఈ ఆదాయం భర్త ఆదాయం కింద పరిగణిస్తారు. భార్యకు ఎలాంటి నోటీసు జారీ కాదు. కానీ ఆ డబ్బుల్ని భార్య ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుండి..దానిపై ఆదాయం వస్తుంటే ట్యాక్స్ పరిధిలో వస్తుంది. సులభంగా చెప్పాలంటే ఇన్వెస్ట్‌మెంట్‌పై వచ్చే ఆధాయం ట్యాక్స్ పరిధిలో వస్తుంది. ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 269 ఎస్ఎస్, 269 టి ప్రకారం 20 వేలు నగదు లావాదేవీ దాటితే జరిమానా ఉంటుంది. 

అదే విధంగా తండ్రీ కొడుకులు, భార్యాభర్తల మధ్య లేదా దగ్గరి బంధుత్వాల్లో జరిగే లావాదేవీలపై పెనాల్టీ లేదా ట్యాక్స్ ఉండదు. కొన్ని కేసులకు మినహాయింపు ఉంటుంది. సులభంగా చెప్పాలంటే భార్యకు లేదా తండ్రికి ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు అందవు. అదే డబ్బుల్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఆదాయం పొందుతుంటే మాత్రం ట్యాక్స్ ఉంటుంది. 

Also read: Air India Offers: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి భారీ ఆఫర్, 1000 రూపాయలకే ఫ్లైట్ టికెట్ లిమిటెడ్ ఆఫర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News