IRCTC New AI Feature: ఐఆర్‌సీటీసీ కొత్త ఫీచర్, ఇక టికెట్ అడిగితే చాలు క్షణాల్లో బుక్ అయిపోతుంది

IRCTC New AI Feature: రైల్వే ప్రయాణీకుల సౌకర్యం, సౌలభ్యం కోసం ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు అందిస్తుంటుంది. ఇందులో భాగంగా ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఫీచర్ ప్రారంభించింది. ఇక రైల్వే టికెట్లు కావాలంటే అడిగితే చాలు..బుక్ అయిపోతాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 9, 2024, 01:36 PM IST
IRCTC New AI Feature: ఐఆర్‌సీటీసీ కొత్త ఫీచర్, ఇక టికెట్ అడిగితే చాలు క్షణాల్లో బుక్ అయిపోతుంది

IRCTC New AI Feature: ఐఆర్‌సీటీసీ ఇప్పుడు ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ లాంచ్ చేసింది. ఈ కొత్త ఫీచర్‌తో రైల్వే టికెట్ల బుకింగ్ ఇకపై మరింత సులభతరం కానుంది. అంటే వివరాలు ఎంటర్ చేసేందుకు టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ్నించి ఎక్కడికి ఎప్పుడు టికెట్ కావాలో అడిగితే చాలు బుక్ అయిపోతుంది. 

రైల్వే ప్రయాణీకుల కోసం ఇండయన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్‌‌సీటీసీ కొత్త సర్వీస్ ప్రారంభించింది. ఇప్పుడిక టికెట్ బుకింక్ కోసం వివరాలన్నీ టైప్ టేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కటి ఎంటర్ చేసే పని లేదు. కేవలం అడిగితే చాలు టికెట్ బుక్ అయిపోతుంది. ఇండియన్ రైల్వేస్ కొత్తగా AskDisha 2.0పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 
చాట్‌బోట్ ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా మీరు నోటితో అడిగితే చాలు టికెట్ బుక్ అవుతుంది. కేవలం టికెట్ల బుకింగ్ ఒక్కటే కాకుండా ఇంకా చాలా పనులు చేయవచ్చు. 

ఏఐ చాట్‌బోట్ అంటే ఏమిటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే వర్చువల్ అసిస్టెంట్ చాట్‌బోట్ ఇది. టికెట్లు బుక్ చేసేందుకు, కేన్సిల్ చేసేందుకు, బోర్డింగ్ స్టేషన్ మార్చేందుకు, రిఫండ్ చెక్ చేసేందుకు, పీఎన్ఆర్ స్టేటస్ చెకింగ్ ఇతరత్రా పనులకు ఉపయోగపడుతుంది. ఇ టికెట్ బుకింగ్ మరింత సులభమయ్యేలా ఏఐతో తొలి ప్రయత్నం ఇది. 

ఈ యాప్ ఆధారంంగా రైల్వే టికెట్లు బుకర్ చేసుకోవచ్చు. పీఎన్ఆర్ స్టేటస్ చెక్, టికెట్ కేన్సిలింగ్, రిఫండ్ స్టేటస్, బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవడం, బుకింగ్ హిస్టరీ చెక్, వ్యూ ఇ టికెట్స్, డౌన్‌లోడ్ ఈఆర్ఎస్, ప్రింట్ అంట్ షేరింగ్ ఆఫ్ టికెట్స్ పనులు నోటితో అడిగి పూర్తి చేయవచ్చు. దీనికోసం ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్‌లో చాట్‌బోట్ వాడుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే కుడి చేతివైపు ఒక ఐకాన్ కన్పిస్తుంది. అది క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్‌తో తత్కాల్ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. అది కాకుండా ఐఆర్‌సీటీసీ మాస్టర్ లిస్ట్ ఫీచర్ కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సహాయంతో ప్రయాణీకుల వివరాలు ముందుగా ఫిల్ చేసి ఉంచుకోవాలి. బుకింగ్ చేసేటప్పుడు ఎక్కువ సమయం వృధా కాకుండా ఉంటుంది. ఇది తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో దోహదం చేస్తుంది. 

మందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మై ఎక్కౌంట్ ఎంపిక చేసుకోవాలి. అక్కడ్నించి మై ప్రొఫైల్ ఆప్షన్ తీసుకోవాలి. యాడ్/మోడిపై మాస్టర్ లిస్ట్ కన్పిస్తుంది. అది ఎంచుకోవాలి. ఆ తరువాత పాసెంజర్ పేరు, జెండర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కితే మాస్టర్ లిస్ట్ సిద్ధంగా ఉంటుంది. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఈ మాస్టర్ లిస్ట్‌లో ప్రయాణీకుల వివరాలు టిక్ చేసుకుంటే సరిపోతుంది. 

Also read: Bank Holidays 2024: రేపట్నించి ఈ నెలలో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News