ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వేస్ తీసుకున్న మరో నిర్ణయం

ఇండియన్ రైల్వేస్ తీసుకున్న మరో నిర్ణయం

Last Updated : Sep 4, 2018, 06:30 PM IST
ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వేస్ తీసుకున్న మరో నిర్ణయం

ఇదివరకు భారతీయ రైల్వే అంటే 'వరల్డ్స్ లార్జెస్ట్ ఓపెన్ టాయిలెట్' అనే వ్యంగ్యాస్త్రాలు వినిపించేవి. అయితే, దాదాపు అన్ని రైళ్లలో బయో-టాయిలెట్స్ ఏర్పాటు చేయడంతో ఆ చెడ్డపేరును తుడిచేయడంలో భారతీయ రైల్వే విజయం సాధించింది. కాకపోతే, రైల్వే స్టేషన్స్‌లో టాయిలెట్స్ నిర్వహణపై మాత్రం ఇప్పటికీ భారతీయ రైల్వే ఆరోపణలు ఎదుర్కోక తప్పడం లేదు. రైల్వే స్టేషన్స్‌లోని టాయిలెట్స్ సరైన నిర్వహణ లేకపోవడంతో అపరిశుభ్రంగా కనిపిస్తూ దుర్వాసన కలిగించడమే అందుకు కారణం. అయితే, ఇకపై రైల్వే స్టేషన్లలోని టాయిలెట్స్‌ని సైతం పరిశుభ్రంగా మార్చి ప్రయాణికుల మన్ననలు పొందాలని భావిస్తోన్న ఇండియన్ రైల్వే, అందుకోసం ఓ సరికొత్త పరిష్కార మార్గంతో ప్రయాణికుల ముందుకొచ్చింది. 

అక్టోబర్ 2 తర్వాత ఏదైనా రైల్వే స్టేషన్లలోని టాయిలెట్స్ పరిశుభ్రంగా లేనట్టయితే, ఆ వివరాలను పేర్కొంటూ ఇండియన్ రైల్వే సోషల్ మీడియా హ్యాండిల్స్ (ఫేస్‌బుక్, ట్విటర్) ద్వారా కానీ లేదా కింది వాట్సాప్ నెంబర్ల ద్వారా నేరుగా రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చంటూ ప్రకటించింది. పశ్చిమ రైల్వే జోన్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు తమ ఫిర్యాదులను 9004499773 నెంబర్ ద్వారా అధికారులకు చేరవేయవచ్చు. అలాగే సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని ప్రయాణికులు 9987645307 వాట్సాప్ నెంబర్‌కి ఫిర్యాదు చేయవచ్చు. 

ప్రస్తుతానికి వెస్టె్ర్న్ రైల్వే, సెంట్రల్ రైల్వే పరిధిలో చేపట్టనున్న ఈ ప్రయోగాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్టు ముంబై డివిజనల్ రైల్వే మేనేజర్ (సెంట్రల్ రైల్వే) ఎస్‌కే జైన్ తెలిపారు.

Trending News