Independece Day 2024: ప్రతి యేడాది ఆగస్టు 15నభారత దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు.
ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రం సిద్దించింది అనడానికీ గుర్తుగా మన దేశ త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. తొట్ట తొలి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను కిందికి దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది.
రిపబ్లిక్ డే జనవరి 26 నాడు భారత రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన జాతీయ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా మన దేశ జెండాను ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు. ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు.
దేశ ప్రజలకు ప్రతినిధి, భారత దేశ పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాన మంత్రి స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ పతాకం ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున భారత రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది.
స్వాతంత్ర్యం సిద్దించిన టైమ్ కు భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు.అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మన జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన తేడా ఏమిటంటే..
ఇండిపెండెన్స్ డే రోజున సందర్భంగా భారత దేశ ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting).
రిపబ్లిక్ డే నాడు భారత రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు(Flag Unfurling).ఇంకొక తేడా ఏమిటంటే .. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు వేరే వేరు ప్రదేశాల్లో జరుగుతాయి.
స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో ఘనంగా జరుగుతుంది. ఈ సారి 78వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్నాము. ఇక గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు కర్తవ్యపథ్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter