Prophet Row Protests: 'ప్రవక్త'పై అనుచిత వ్యాఖ్యల చిచ్చు.. ఆందోళనలు హింసాత్మకం.. రాంచీలో ఇద్దరి మృతి

Prophet Row Protests: రాంచీలో ముస్లింలు జరిపిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అయితే పోలీసుల కాల్పుల్లోనే వీరు మృతి చెందారా లేక మరెవరైనా కాల్పులు జరిపారా అనే విషయంలో క్లారిటీ లేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 12, 2022, 07:21 AM IST
  • మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు రేపిన చిచ్చు
  • పలు రాష్ట్రాల్లో భారీ నిరసన ప్రదర్శనలు
  • రాంచీలో ఇద్దరి మృతి, యూపీలో వందలాది మంది అరెస్ట్
Prophet Row Protests: 'ప్రవక్త'పై అనుచిత వ్యాఖ్యల చిచ్చు.. ఆందోళనలు హింసాత్మకం.. రాంచీలో ఇద్దరి మృతి

Prophet Row Protests: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో వందలాది మంది ముస్లింలు రోడ్డెక్కారు. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ క్రమంలో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీంతో పోలీసులు కొన్నిచోట్ల గాల్లోకి కాల్పులు జరిపారు. లాఠీఛార్జితో నిరసనకారులను చెదరగొట్టారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో జార్ఖండ్‌లోని రాంచీలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. 14 మంది పోలీసులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది.

జార్ఖండ్‌లో ఇద్దరు మృతి.. కాల్పులు జరిపింది ఎవరు? :

రాంచీలో ముస్లింలు జరిపిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అయితే పోలీసుల కాల్పుల్లోనే వీరు మృతి చెందారా లేక మరెవరైనా కాల్పులు జరిపారా అనే విషయంలో క్లారిటీ లేదు. అబ్సర్ అనే యువకుడి శరీరంలోకి ఆరు బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. ప్రస్తుతం అతను రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. నిజానికి తాను నిరసన ప్రదర్శనల్లో పాల్గొనలేదని... మార్కెట్ నుంచి తిరిగొస్తున్న క్రమంలో తనపై కాల్పులు జరిగాయని చెప్పాడు. ఆందోళనకారులు రాళ్లు రువ్వగా.. పోలీసులు కాల్పులు జరపడం తాను చూశానని చెప్పాడు. తబారక్ అనే మరో యువకుడు కూడా ఇలాగే కాల్పులకు గురయ్యాడు. మొత్తంగా రాంచీలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘటనలపై జార్ఖండ్ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది.

పశ్చిమ బెంగాల్‌లో 60 మంది అరెస్ట్ :

పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు 60 మందిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిపై అల్లర్లు, హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం అభియోగాలు మోపారు. ముర్షీదాబాద్ జిల్లాలోనూ ఆందోళనలను చెలరేగగా... పలుచోట్ల ఆందోళనకారులు ఇళ్లకు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. అల్లర్లు రెచ్చగొట్టినవారిపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. 

ఉత్తరప్రదేశ్‌లో 255 మంది అరెస్ట్:

ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు 255 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకూ 13 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. నిందితులపై కఠిన చర్యలు తప్పవని సీఎం యోగి ఆదిత్యానాథ్ హెచ్చరించారు. మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌, ఢిల్లీల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. 

Also Read: Horoscope Today June 12th : రాశి ఫలాలు... ఇవాళ ఏయే రాశుల వారికి శుభప్రదం.. ఎవరికి ఏ విషయంలో మంచి జరుగుతుందో తెలుసుకోండి..

Also Read: Prathyusha Garimella: హైదరాబాద్‌లో ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్ ప్రత్యూష బలవన్మరణం..కారణాలు ఇవేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News