జన్ ధన్ లూట్ యోజన: ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

ట్విటర్‌లో ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన రాహుల్ గాంధీ

Last Updated : Feb 25, 2018, 01:28 AM IST
జన్ ధన్ లూట్ యోజన: ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

ఢిల్లీకి చెందిన మరో జువెల్లర్స్ వ్యాపారి కూడా నిరవ్ మోడీ తరహాలోనే ఫేక్ డాక్యుమెంట్స్‌తో బ్యాంకులకి రూ.390 కోట్ల కుచ్చు టోపీ పెట్టాడనే వార్తలు అలా బయటికి పొక్కాయో లేదో వెంటనే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్‌పై ట్విటర్ ద్వారా తనదైన స్టైల్లో విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జన ధన్ యోజన పథకాన్ని లక్ష్యంగా చేసిన రాహుల్ గాంధీ... " మోడీ ప్రవేశపెట్టిన జన్ ధన్ లూట్ యోజన పథకం కింద మరో కుంభకోణం చోటుచేసుకుంది" అంటూ ఓ ట్వీట్ చేశారు. నిరవ్ మోడీ తరహాలోనే కుంభకోణానికి పాల్పడిన ఈ వ్యాపారి కూడా విజయ్ మాల్యా, నిరవ్ మోడీల తరహాలోనే ఈపాటికి దేశం విడిచిపెట్టి పారిపోయి వుండుంటాడు అని రాహుల్ గాంధీ తన ట్వీట్‌తో ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

 

ఢిల్లీలోని కరోల్‌బాఘ్‌కి చెందిన ద్వారకా దాస్ సేథ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే జువెలర్స్ వాణిజ్య సంస్థ ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ నుంచి నకిలీ ధృవపత్రాలతో రూ.389.85 కోట్ల రుణం పొందిన తీరుపై సీబీఐ కేసు నమోదు చేయడంపై స్పందిస్తూ రాహుల్ గాంధీ ఈ ట్వీట్ చేశారు. 

Trending News