Pawan kalyan: పవన్ కు డబుల్ ధమాకా.. స్టేట్ తో పాటు సెంట్రల్ లోను చక్రం తిప్పే అరుదైన అవకాశం..

Modi 3.0 Oath: మోదీ మూడోసారి ప్రధానిగా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. తొలుత జనసేన పవన్ కళ్యాణ్ కు మోదీ క్యాబినేలో కీలక మంత్రి పదవి ఉంటుందని అందరు భావించారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 9, 2024, 05:58 PM IST
  • ఆరు నెలల తర్వాత మోదీ క్యాబినేట్ లోకి పవన్..
  • ఫుల్ జోష్ లో జనసైనికులు..
Pawan kalyan: పవన్ కు డబుల్ ధమాకా.. స్టేట్ తో పాటు సెంట్రల్ లోను చక్రం తిప్పే అరుదైన అవకాశం..

Pawan kalyan dual role in ap and central govt: దేశ రాజకీయాల్లో మరికొన్ని గంటల్లో కీలక ఘట్టం చోటుచేసుకుటుంది. మోదీ తన మిత్ర పక్ష పార్టీల సపోర్ట్ హ్యట్రిక్ గా ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్రంలో మోదీ అధికారం చేపట్టడానికి, మూడో సారి పీఎంగా ప్రమాణ స్వీకారానికి ఇటు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు, అటు బీహర్ నితీష్ కుమార్ లు ఇద్దరు కూడా కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో.. ఇద్దరు నేతలు కూడా మోదీకీ తమ మద్దతును ప్రకటించారు. దీంతో మోదీ మరికొన్ని గంటల్లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదిలా ఉండగా.. అందరు భావించినట్లు మోదీ క్యాబినేట్ లో పవన్ కళ్యాణ్ కు కీలక మంత్రి పదవి ఉంటుందని అందరు భావించారు.

Read more; Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

కానీ ఎవరు ఊహించని విధంగా ఈ సారి  టీడీపీ నుంచి ఇప్పటికే.. కేంద్ర మంత్రివర్గంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌లకు మంత్రిపదవి దక్కింది. క్యాబినెట్ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మకు కూడా మోదీమంత్రి వర్గంలో చోటు లభించినట్లు తెలుస్తోంది. ఆయన నరసాపురం నుంచి ఎంపీగా గెలిచారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కూడా కేంద్ర మంత్రుల జాబితా ఉన్నారు.

ఇప్పటికే మోదీ క్యాబినేట్ లో ప్రమాణ స్వీకారం చేసే మంత్రులంతా ఢిల్లీకి చేరుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు ఎలాంటి మంత్రి పదవి ఇవ్వక పోవడం పట్ల ఆయన అభిమానులు, జనసైనికులు ఒకింత నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. కానీ మోదీ ఇప్పటికే జనసేనానికి కేంద్ర మంత్రి వర్గంలో ఆఫర్ ఇస్తే.. ఆయన ఆరు నెలల  తర్వాత చేరుతానని చెప్పారంట. ఇప్పుడైతే ఏపీలో చంద్రబాబు క్యాబినేట్ లో ఉంటానని చెప్పినట్లు సమాచారం. ఏపీలో పవన్ కు డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవి ఇవ్వనున్నట్లు కూడా వార్తలు జోరుగా విన్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో ఏపీలో బీజేపీ కొత్త గేమ్ స్టార్ట్ చేస్తుందని తెలుస్తోంది.

Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..

పవన్ కళ్యాణ్ విషయంలో  మాత్రం బీజేపీ పెద్దలు బడా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్ ప్రస్తుతం ఏపీలోను, భవిష్యత్తులో కేంద్రంలోను చక్రం తిప్పుతారని వార్తలు జోరుగా నడుస్తున్నాయి. ఏపీ ప్రజలకు మంచి చేయాలని తన మొదటి కర్తవ్యమని జనసేనాని పలుమార్లుచెప్పారు. రాజధాని నిర్మించడం, ఏపీకి స్పెషల్ స్టేటస్, పోలవరం, విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యను పరిష్కరించడం వంటి ప్రధాన అజెండాలుగా ఏపీలో కూటమి పనిచేస్తుందని పవన్ తెలిపారు. దీంతో తొలుత నిరాశకు గురైన జనసైనికులు.. అసలైన పవన్ ప్లాన్ తెలుసుకుని ఆ తర్వాత ఫుల్ జోష్ గా మారినట్లు సమాచారం. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News