Bihar: బీహార్‌ సీఎంగా మరోమారు నితీష్‌కుమార్‌ ప్రమాణం..కొత్త కేబినెట్ కూర్పు ఇదే..!

Bihar Political Drama: బీహార్‌ రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీఏ కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చింది. అక్కడ తాజాగా సరికొత్త కూటమి ఏర్పాటైంది. మరోసారి సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Written by - Alla Swamy | Last Updated : Aug 10, 2022, 12:36 PM IST
  • బీహార్‌ పొలిటికల్ డ్రామా
  • సీఎంగా ప్రమాణం చేయనున్న నితిష్
  • మరికొంత మంది ప్రమాణం చేసే అవకాశం
Bihar: బీహార్‌ సీఎంగా మరోమారు నితీష్‌కుమార్‌ ప్రమాణం..కొత్త కేబినెట్ కూర్పు ఇదే..!

Bihar Political Drama: బీహార్‌లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. జేడీయూ అగ్రనేత నితీష్‌కుమార్ 8వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈసారి ఆర్జేడీ, ఇతర విపక్షాల కూటమితో కలిసి ప్రభుత్వానికి ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మహాకూటమిగా నామకరణం చేశారు. కాసేపట్లో సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు.

2000 నుంచి ఇప్పటివరకు బీహార్ సీఎంగా నితీష్‌ కుమార్ 8వ సార్లు ప్రమాణం చేశారు. తొలిసారి 2000, రెండోసారి 2005 నవంబర్‌లో, మూడోసారి 2010 నవంబర్‌లో ప్రమాణస్వీకారం చేశారు. నాల్గోసారి 2015 ఫిబ్రవరి, 2015 నంబర్‌లో ఐదోసారి, ఆరోసారి 2017 జులైలో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 2020 నవంబర్‌లో, 8వ సారి ఇవాళ చేయనున్నారు.

ఆయనతోపాటు డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తనయుడు తేజస్వీ యాదవ్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. మొత్తం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతోపాటు 164 మంది ఎమ్మెల్యేలు నితీష్‌కుమార్‌కు మద్దతు తెలిపారు. మంగళవారం బీహార్‌లో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. ఆయన ఎన్డీఏ నుంచి బయట వచ్చిన వెంటనే ప్రతిపక్షాలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు.

సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణస్వీకారం చేస్తారు. గతకొంతకాలంగా ఎన్డీఏ, బీజేపీకి నితీష్‌కుమార్ దూరంగా ఉన్నారు. త్వరలో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తారని ప్రచారం జరిగింది. ఇందుకు అనుగుణంగా మంగళవారం జేడీయూ నుంచి కీలక ప్రకటన వచ్చింది. గతంలో విపక్షాలతో జేడీయూ ఉండేది. 

రాజకీయ పరిణామాలతో బీజేపీతో కతకట్టాల్సి వచ్చింది. ఐతే మళ్లీ ప్రతిపక్షాల నుంచి సానుకూల పరిణామాలు రావడంతో..రాజకీయ భవిష్యత్ దృష్ట్యా నితిష్‌కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో కేబినెట్ కూర్పు ఉండనుంది. ఆర్జేడీ, ఇతర ప్రతిపక్షాల నుంచి మంచి పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. త్వరలో జాబితా విడుదల కానుంది.

మొత్తంగా సార్వత్రిక ఎన్నికల ముందు దేశంలో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ ఎదురుదెబ్బ తప్పదన్న వార్తలకు ఈ అంశాలను ఊతం మిస్తున్నాయి. ఎన్డీఏ నుంచి ఇటీవల చాలా పార్టీలు బయటకు వచ్చాయి. శివసేన, టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీలు అధికార కూటమి నుంచి బయటకు వచ్చాయి. అనేక పరిణామాల మధ్య మహారాష్ట్రలో బీజేపీలో పవర్‌లోకి వచ్చింది. ఐతే అక్కడ శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ తప్పదంటున్నారు విశ్లేషకులు.

Also read:Hyd Metro: హైదరాబాద్‌ మెట్రోకు పూర్వ వైభవం దక్కేనా..రోజువారి ప్రయాణికుల సంఖ్య ఎంతంటే..!

Also read:Corona Updates in India: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..లెటెస్ట్ రిపోర్ట్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News