JEE Advanced Exams: కరోనా నేపధ్యంలో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష వాయిదా

JEE Advanced Exams: కరోనా మహమ్మారి దెబ్బకు విద్యా సంవత్సరానికి ఆటంకం ఏర్పడుతోంది. కరోనా వైరస్ ఉధృతి నేపధ్యలో జేఈఈ అడ్వాన్స్‌డ్ వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా నిర్ణయించలేదు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 27, 2021, 05:03 PM IST
 JEE Advanced Exams: కరోనా నేపధ్యంలో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష వాయిదా

JEE Advanced Exams: కరోనా మహమ్మారి దెబ్బకు విద్యా సంవత్సరానికి ఆటంకం ఏర్పడుతోంది. కరోనా వైరస్ ఉధృతి నేపధ్యలో జేఈఈ అడ్వాన్స్‌డ్ వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా నిర్ణయించలేదు.

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) నేపధ్యంలో వరుసగా పరీక్షలన్నీ వాయిదా పడుతున్నాయి. ఇప్పుడు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్‌డ్ 2021 వాయిదా పడింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జూలై 3న జరగాల్సిన ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఖరగ్‌పూర్ ఐఐటీ వెల్లడించింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది మరోసారి ప్రకటిస్తామని తెలిపింది. జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణులైనవారిలో అత్యధిక మార్కులు కలిగిన 2 లక్షల 50 వేలమంది అభ్యర్ధులు జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం అర్హులవుతారు. కరోనా మహమ్మారి కారణంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing Agency) ఇప్పటికే జేఈఈ మెయిన్ 2021, ఏప్రిల్, మే సెషన్ పరీక్షల్ని వాయిదా వేశారు. మెయిన్ వాయిదా పడటంతో ఇక అడ్వాన్స్‌డ్ కూడా వాయిదా వేయక తప్పని పరిస్థితి.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో(JEE Advanced Exam) రెండు పేపర్లుంటాయి. మొదటి పేపర్ ఉదయం 9 గంటల్నించి మద్యాహ్నం 12 గంటల వరకూ ఉంటుంది. రెండవ పేపర్ మద్యాహ్నం 2.30 గంటల్నించి సాయంత్రం 5.30 గంటల వరకూ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ ఉత్తీర్ణత ఆధారం. 

Also read: Chhattisgarh: 5 కేజీల భారీ IED బాంబును గుర్తించి, నిర్వీర్యం చేసిన కోబ్రా బలగాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News