భోపాల్: భారత్‌లో వ్యాపిస్తున్న కరోనావైరస్‌కి ప్రధాన కారణం విదేశీయులు.. లేదా విదేశాలకు వెళ్లొచ్చిన భారతీయులేనని పదేపదే నిరూపితమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అటువంటు ఘటనే మరొకటి చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ జర్నలిస్టుకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఆ జర్నలిస్టు కూతురు మార్చి 17న లండన్ నుండి ఇండియాకు తిరిగొచ్చారు. ఆమెకు కూడా కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ జర్నలిస్టు భార్య, కుమారుడు, ఇంట్లో పనిచేసే పనోళ్లకు కూడా కోవిడ్ టెస్ట్ నిర్వహించగా.. వారికి నెగటివ్ అని తేలింది. ఒకే ఇంట్లో జర్నలిస్టుకు, ఆయన కూతురికి కూడా కరోనావైరస్ సోకిందని తెలిసిన అనంతరం మధ్యప్రదేశ్ సర్కార్‌లోనూ ఓ రకమైన కలవరం మొదలైంది.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తన రాజీనామా చేస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఈ జర్నలిస్టు కూడా హాజరయ్యాడు. అన్నింటికిమించి ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ బల పరీక్ష కవరేజీకి సైతం ఈ జర్నలిస్టు హాజరయ్యాడని తెలియడంతో అతడితో కలిసి పనిచేసే మీడియా మిత్రులకు, సదరు జర్నలిస్టుకు ఇంటర్వ్యూలు ఇచ్చే క్రమంలో అతడితో చనువుగా మెదిలిన రాజకీయ నాయకులను ఇప్పుడు 'కరోనా' భయం వెంటాడుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..