నేడు కర్ణాటక ఎన్నికల ర్యాలీలలో పాల్గొననున్న అగ్రనేతలు

కర్ణాటకలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది  ప్రచారం జోరందుకుంది.

Last Updated : May 8, 2018, 09:13 AM IST
నేడు కర్ణాటక ఎన్నికల ర్యాలీలలో పాల్గొననున్న అగ్రనేతలు

కర్ణాటక: కర్ణాటకలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది  ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో రెండేళ్ల తరువాత తొలిసారి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ నేడు పాల్గొంటారు. కర్ణాటకలోని బీజాపూర్‌లో జరిగే కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొంటారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు దక్షిణ కర్ణాటక, బెంగళూరు అర్బన్ ఓటర్లతో సమావేశం అవుతారు. అలాగే చిక్బళ్లాపూర్, తుముకూరులలో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొని ప్రసంగిస్తారు. సోమవారం కోలార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సైకిల్ తొక్కారు. మొబైల్ ఫోన్‌లో వర్క్ మోడ్, స్పీకర్ మోడ్, ఏయిరోప్లేన్ మోడ్ అనే మూడు మోడ్స్ ఉంటాయని, ప్రధాని మోదీ కేవలం స్పీకర్, ఏయిరోప్లేన్ మోడ్‌లను మాత్రమే వాడుతారని, అయిన ఎప్పటికీ వర్క్ మోడ్ ఉపయోగించరంటూ ఆరోపించారు.   

ప్రధాని మోదీ కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు ర్యాలీలలో పాల్గొంటారు. బెంగళూరులో ఈ రోజు భారీ ర్యాలీలో ప్రసంగించనున్నారు. సాయంత్రం నేషనల్ కాలేజి మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే బెంగళూరు సిటీలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులను ఆయన ఈ సభ ద్వారా ప్రజలకు పరిచయం చేస్తారు. అలాగే కర్నాటకలోని కొప్పల్, విజయపురలలో కూడా మోదీ ప్రచారం చేస్తారు. సోమవారం ‘నమో’ యాప్‌ ద్వారా కర్ణాటక యువమోర్చా కార్యకర్తలతో మాట్లాడిన మోదీ 'కాంగ్రెస్‌కు టెక్నాలజీ అంటే భయమని, అందుకే ఆధార్, ఈవీఎంలను వ్యతిరేకిస్తోందని విమర్శించారు.

కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడుగు, మడికెరలలో జరిగే రోడ్ షోలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. అలాగే బెంగళూరు అర్బన్‌లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అలాగే మంగళూరులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారు.

Trending News