Bengaluru Hanuman Chalisa Row: హనుమాన్ చాలీసా ప్లే చేసినందుకు దాడి.. వీడియో వైరల్..

Karnataka Row: కొందరు యువకులు ఆదివారం సాయంత్రం మొబైల్ ఫోన్ షాపుకు వచ్చి హల్ చల్ చేశారు. అక్కడ షాపులో ఓనర్ హనుమాన్ చాలీసాను పెట్టుకుని వింటున్నాడు. ఇంతలో కొందరు ముస్లిం యువకులు అక్కడికి చేరుకున్నాడు. ఇది రంజాన్ ఆజాన్ సమయమంటూ అతనితో వాగ్వానికి దిగారు.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 18, 2024, 05:41 PM IST
  • షాప్ ఓనర్ పై ముస్లిం యువకుల దాడి..
  • హనుమాన్ చాలీసా మ్యూజిక్ పై అభ్యంతరం..
Bengaluru Hanuman Chalisa Row: హనుమాన్ చాలీసా ప్లే చేసినందుకు దాడి.. వీడియో వైరల్..

Shopkeeper Brutally attacked In Bengaluru: మన దేశంలో మొదటి నుంచి భిన్నత్వంలో ఏకత్వం ను పాటిస్తుంటారు. ఒకరి మతాలు, పండుగలను మరోకరు గౌరవించుకుంటారు.  హిందు, ముస్లింలు సోదరభావంతో ఉంటారు. ఒకరి పండుగలకు మరోకరిని ఇంటికి ఆహ్వానిస్తుంటారు. పరస్పరం సోదరభావంతో కలిసి మెలసి ఉంటారు. కానీ కొందరు దీనిలో ఎప్పుడు ఏదో ఒకచిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తుటారు. సోదరుల్లా ఉన్న హిందు ముస్లింల మధ్యలో గొడవలు వచ్చేలా పనులు చేస్తుంటారు. కొందరు ఆకతాయి యువకులు, కావాలని ఒకరినిమరోకరిమీద రెచ్చగొట్టే పనులను చేస్తుంటారు. దీంతో సోదరుల్లాంటి హిందుముస్లింల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 

 

పూర్తి వివరాలు..

కర్ణాటకలో ఆదివారం ఊహించని ఘటన జరిగింది. కబ్బన్‌పేట పరిధిలోని సిద్దన్నగల్లి వద్ద ఆదివారం సాయంత్రం కొందరు ఆకతాయి యువకులు రచ్చ చేశారు. సాయంత్రం ప్రాంతంలో ఒక గల్లీలో ఉన్న షాపు గుండా వెళ్లున్నారు. ఆ సమయంలో షాపు లో హనుమాన్ చాలీసా ప్లే అవుతుంది. వెంటనే ఆగంతలకుగు మ్యూజిక్ సిస్టమ్ ఆపేయాలని,ఇది ఆజాన్ సమయమంటూ గొడవకు దిగారు. షాపులోకి వెళ్లి ఓనర్ తో వాగ్వాదానికి దిగారు. అంతే కాకుండా.. ఓనర్ మీద ఐదారుగురు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ పెద్ద గొడవ జరిగింది.

కాసేపటికి ఆకతాయిలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ క్రమంలో బాధితుడు స్థానికంగా ఉన్నపోలీసు స్టేషన్ లో వెళ్లి ఫిర్యాదు చేశాడు. అంతే కాకుండా.. తనను చంపుతానంటూ కూడా దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటనపై బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Read More: Venomous Snake: లోదుస్తులు పెట్టే ర్యాక్ లో ప్రపంచంలోనే రెండో అత్యంత విషసర్పం.. ఆ తర్వాత ఏంజరిగిందో తెలుసా..?

మొదట బాధితుడి నుంచి పోలీసులు ఫిర్యాదుతీసుకొవడంతో కూడా తాత్సరం చేశారని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు.. సీఎం సిద్ధరామయ్యను టార్గెట్ గా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో  సిద్ధరామయ్య ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. లోక్ సభ ఎన్నికల వేళ ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News