బెంగళూరు: 100 మీటర్ల రేసులో 9.58 సెకన్లలో ప్రపంచ రికార్డును కలిగి ఉన్న సంచలన రన్నర్, ఒలంపిక్ వీరుడు, అంతర్జాతీయ అథ్లెట్, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా, కర్ణాటకకు చెందిన శ్రీనివాస గౌడ పరిగెత్తిన వేగం ట్విట్టర్ వేదికగా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. 100 మీటర్ల దూరం కేవలం 9.55 సెకన్ల సమయంలోనే పరిగెత్తిన సమయం అందరినీ ఆశ్చ్యర్య పరుస్తుంది.
కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సాయ్(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులు శ్రీనివాస్ ను కలిశారని, సోమవారం నాటికి సాయ్ కేంద్రానికి చేరుకునేలా అతనికి రైలు టికెట్ ను ఏర్పాటు చేశామని, శ్రీనివాస్ గౌడకు మంచి కోచ్ తో శిక్షణ ఇప్పిస్తానని హామీ ఇస్తున్నాని అన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించడానికి అన్ని ప్రయత్నాలు చేద్దాము’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పి మురళీధర్ రావు కూడా ట్వీట్ చేశారు.
Yes @PMuralidharRao ji. Officials from SAI have contacted him. His rail ticket is done and he will reach SAI centre on monday. I will ensure top national coaches to conduct his trials properly. We are team @narendramodi ji and will do everything to identity sporting talents! https://t.co/RF7KMfIHAD
— Kiren Rijiju (@KirenRijiju) February 15, 2020
కర్ణాటకలోని మంగళూరు పట్టణంలోని ముదబిద్రి ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ గౌడ, భవన నిర్మాణరంగంలో కూలి పనులు చేసుకునే శ్రీనివాస్ గౌడ ఈ నెల 1న కంబాలా రేసులో 142 మీటర్ల రేసును 13.42 సెకన్లలో పరుగెత్తి రికార్డు సృష్టించాడు. ఈ క్రీడ బురద నీళ్లున్న పొలం మడులలో జరుగుతుంది. రెండు ఎద్దులతో కలిసి దాని వెంబడి పరిగేత్తే ఓ కర్ణాటక సాంప్రదాయ ఆటలో శ్రీనివాస్ గౌడ ఈ పోటీలో పాల్గొన్నాడు. కాగా, సామాజిక మాధ్యమాల్లో ఇతనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..