కర్ణాటక ఎన్నికలు: బీజేపీ మ్యానిఫెస్టో విడుదల

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది.

Last Updated : May 4, 2018, 02:59 PM IST
కర్ణాటక ఎన్నికలు: బీజేపీ మ్యానిఫెస్టో విడుదల

బెంగళూరు:  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. మహిళల దృష్టిని ఆకర్షించే విధంగా, రైతన్నలకు భరోసా కల్పించేలా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే 'ముఖ్యమంత్రి స్మార్ట్‌ఫోన్ యోజన' అనే కొత్త పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. గోవధ చట్టాన్ని పటిష్టంగా అమలయ్యేలా చేస్తామని హామీ కూడా ఇచ్చింది.

మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యాంశాలు:

  • పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం రూ.1,50,000 కోట్లు కేటాయిస్తాం
  • ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తాం
  • రైతు రుణాలను రూ.లక్ష వరకు మాఫీ చేస్తాం.. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పిస్తాం
  • మహిళల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.. వారి రక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం
  • మహిళలపై ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక మహిళా విచారణ అధికారిని నియమిస్తాం
  • దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మహిళలందరికీ ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు ఇస్తాం
  • స్త్రీ సువిధ పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మహిళలు, అమ్మాయిలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్ ఇస్తాం.. మిగతా వారికి ఒక్క రూపాయికి ఇస్తాం
  • మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తాం
  • కర్ణాటక వ్యాప్తంగా అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం
  • హైదరాబాద్ కర్ణాటక ఇండస్ట్రీయల్ మెగా కారిడార్‌ను హోస్పేట నుంచి హైదరాబాద్ వరకు నిర్మిస్తాం

 

Trending News