Farmers rail roko agitation continues till 5th October: చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు (Farm Bills) వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బిల్లులపై లోక్‌సభ, రాజ్యసభలో ప్రకంపనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజ్యసభ (Rajya Sabha) లో ఆందోళన నిర్వహిస్తూ డిప్యూటీ చైర్మన్‌తో అనుచితంగా ప్రవర్తించిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన 8మంది సభ్యులు సైతం సస్పెండ్ అయ్యారు. వ్యతిరేకత మధ్యనే ఎగువ, దిగువ సభల్లో ఆమోదించిన ఈ బిల్లులకు రాష్ట్రపతి సైతం ఆమోద ముద్ర వేశారు. అప్పటినుంచి దేశంలోని పలుచోట్ల భారీ ఎత్తున నిరసనలు కొనసాగాయి. ఈ క్రమంలో పంజాబ్ రైతులు ‘రైల్ రోకో’ కు పిలుపునిచ్చాయి. అయితే ఈ రైల్ రోకో ఉద్యమం ఈ నెల 5 వరకు కొనసాగనుంది. ఈ మేరకు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ శుక్రవారం తెలిపింది. Also read: Agriculture Bill: వ్యవసాయబిల్లుకు గ్రీన్ సిగ్నల్, రాష్ట్రపతి ఆమోదముద్ర
Punjab: Kisan Mazdoor Sangharsh Committee's 'rail roko' agitation continues in Amritsar, in protest against Farm laws; Visuals from Devidaspura village
The Committee's agitation will continue till 5th October. pic.twitter.com/ny3OhrfbuV
— ANI (@ANI) October 2, 2020
కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ పిలుపు మేరకు 9 రోజుల నుంచి పంజాబ్‌లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమృత్‌సర్, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు రైలు పట్టాలపై గుడారాలు వేసుకోని నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు ఆందోళనలో పాల్గొంటున్నారు. వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని కిసాన్ కమిటీ పేర్కొంది. ఇదిలాఉంటే.. ఎన్డీఏ సర్కారు నుంచి బయటకు వచ్చిన శిరోమణి అకాలీదళ్ పార్టీ సైతం రైతు నిరసనలను తీవ్రం చేసింది. Also read: MPs suspension: సమావేశాలను బహిష్కరించిన విపక్ష పార్టీలు