Leopard: గుడిసెలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన చిరుత

మహారాష్ట్ర ( Maharashtra ) లోని అటవీ ప్రాంతంలోని ఓ గుడిసెలో చిరుతపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. జనావాసాలకు దగ్గరలో ఆడ చిరుత ( Leopardess ) పిల్లలకు జన్మనివ్వడంతో ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. 

Last Updated : Aug 19, 2020, 10:15 AM IST
Leopard: గుడిసెలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన చిరుత

Leopardess gives birth inside hut: న్యూఢిల్లీ: మహారాష్ట్ర ( Maharashtra ) లోని అటవీ ప్రాంతంలోని ఓ గుడిసెలో చిరుతపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. జనావాసాలకు దగ్గరలో ఆడ చిరుత ( Leopardess ) పిల్లలకు జన్మనివ్వడంతో ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర నాసిక్ (Nashik ) సమీపంలోని ఇగత్‌పురి ప్రాంతంలోని గుడిసెలో చిరుతపులిని చూసి గిరిజనులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం వారు ఆ ప్రాంతాన్ని సందర్శించి.. చిరుతతోపాటు.. నాలుగు పిల్లలు ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. చిరుతతో పాటు దాని పిల్లలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.   Also read: Healh Tips: పరిగడుపున వెల్లుల్లి తినడం వల్ల లాభాలు తెలుసా..?

చిరుతపులి తమ గ్రామాలకు సమీపంలోనే ఉండటంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారి గణేశ్‌రావు జోల్ మాట్లాడుతూ.. చిరుతపులి పిల్లలను వేరే ప్రదేశానికి తీసుకెళ్లే సమయం కోసం తాము ఎదురు చూస్తున్నామని, పిల్లల కారణంగా ఇప్పుడు చిరుతపులిని పట్టుకోలేమని తెలిపారు. ఇగత్‌పురి ప్రాంతంలో చిరుతపులులు అధిక సంఖ్యలో ఉన్నాయని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఈ చిరుత పులి పిల్లలతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లందరూ సంబరపడుతున్నారు.  Also read: Health tips: తులసి పాలు తాగితే.. ఈ రోగాలు మటుమాయం

Trending News