లోక్ సభ ఎన్నికలు 2019 ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి లైవ్ బ్లాగ్

ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 విడతల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలకు సంబంధించిన కీలకమైన, ఆసక్తికరమైన ఘటనలు, ముఖ్యాంశాల సమాహారాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి లైవ్ బ్లాగ్. మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ లైవ్ బ్లాగ్‌ను ఫాలో అవండి.

Last Updated : May 23, 2019, 08:17 AM IST
  • న్యూఢిల్లీ: అంతర్గతంగా దేశం ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధించారు ? ఉత్తరంలో ఊపు మీద ఉంది ఎవరు ? దక్షిణంలో దంచికొట్టింది ఎవరు ? ఈశాన్యంలో దూసుకుపోయింది ఎవరు ? మొత్తంగా యావత్ దేశాన్ని పాలించబోయే కింగ్ ఎవరనేది ఇవాళే తేలిపోనుంది. కింగ్‌తోపాటే కింగ్ మేకర్ ఎవరో కూడా ఇంకొన్ని గంటల్లో స్పష్టంకానుంది. అవును, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 16వ లోక్ సభకు పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఇటీవల 17వ లోక్ సభకు జరిగిన ఎన్నికలకు నేడు ఓట్ల లెక్కింపు జరగనుంది.
లోక్ సభ ఎన్నికలు 2019 ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి లైవ్ బ్లాగ్
Live Blog

న్యూఢిల్లీ: అంతర్గతంగా దేశం ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధించారు ? ఉత్తరంలో ఊపు మీద ఉంది ఎవరు ? దక్షిణంలో దంచికొట్టింది ఎవరు ? ఈశాన్యంలో దూసుకుపోయింది ఎవరు ? మొత్తంగా యావత్ దేశాన్ని పాలించబోయే కింగ్ ఎవరనేది ఇవాళే తేలిపోనుంది. కింగ్‌తోపాటే కింగ్ మేకర్ ఎవరో కూడా ఇంకొన్ని గంటల్లో స్పష్టంకానుంది. అవును, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 16వ లోక్ సభకు పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఇటీవల 17వ లోక్ సభకు జరిగిన ఎన్నికలకు నేడు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 విడతల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలకు సంబంధించిన కీలకమైన, ఆసక్తికరమైన ఘటనలు, ముఖ్యాంశాల సమాహారాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి లైవ్ బ్లాగ్. మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ లైవ్ బ్లాగ్‌ను ఫాలో అవండి.

23 May, 2019

  • 08:13 AM

    ప్రారంభమైన లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ:

    దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 విడతల్లో జరిగిన లోక్ సభ ఎన్నికలకు నేడు ఉదయం 8 గంటలకు.. అంటే కొద్దిసేపటి క్రితమే ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో 542 లోక్ సభ స్థానాల్లో గెలిచేది ఎవరు ? ఓడేది ఎవరు అనే ఉత్కంఠ మొదలైంది. భారీ సస్పెన్స్ మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

  • 07:14 AM

    భారత దేశ లోక్ సభ ఎన్నికల చరిత్రలో ఇదే తొలిసారి:

    లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే నేడు ఉదయం 8 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనుంది. 542 లోక్ సభ స్థానాలకు కలిపి మొత్తం 7500పైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. 90.99 కోట్ల మంది ఓటర్లలో 67.11 శాతం మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత దేశ లోక్ సభ ఎన్నికల చరిత్రలో అత్యధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x