దేశంలో కరోనా వైరస్ ప్రభావాన్ని అధికంగా ఎదుర్కోంటున్న రాష్ట్రం. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో తాజాగా 778 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 14 మంది వైరస్ కాటుకు బలయ్యారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,427కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడి 283 మంది చనిపోయారు. ఆ మహిళ సేఫ్.. 19సార్లు పాజిటివ్.. 20వ టెస్టులో ఊరట
శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మహారాష్ట్రలో కేసులు, మరణాలు వివరాలను ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. చనిపోయిన వారిలో పూణే జిల్లాకు చెందిన 61 ఏళ్ల పేషెంట్, 40ఏళ్ల మరో పేషెంట్ ఉన్నారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకూ కరోనా మరణాలు 63కు చేరుకున్నాయని జిల్లా అధికారులు తెలిపారు. బ్రేకింగ్: ఏపీలో తాజాగా 62 కరోనా కేసులు, ఇద్దరి మృతి
కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ గడువును మే3 వరకు పొడిగించింది. రైలు, విమానాలు, బస్సు, ఇతరత్రా రవాణా సౌకర్యాలపై తాత్కాలిక నిషేధం విధించారు. కరోనా అదుపులోకి రాని పక్షంలో లాక్‌డౌన్ మరోసారి పొడిగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..