Second Hand Wife: విబేధాలు ఏర్పడిన సమయంలో భార్యతో గొడవపడుతూ ఓ భర్త చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. ఆవేశంలో భర్త మాట్లాడిన మాటలను ఆమె తీవ్రంగా పరిగణించింది. ఇష్టమొచ్చినట్టు భర్త తనను తిడుతున్నారని భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భార్యను దూషిస్తూ మానసికంగా వేధిస్తున్న భర్తకు కోర్టు రూ.3 కోట్ల భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. భార్యను తిట్టిన తిట్లకు భారీ జరిమానా చెల్లించాల్సిన సంఘటన మనదేశంలోనే చోటుచేసుకుంది.
Also Read: Egg Murder: 'కోడిగుడ్డు'తో చనిపోయిన మహిళ.. ప్రేమ వ్యవహారమే కారణం
మహారాష్ట్రలోని ముంబైకి చెందిన సంపన్న కుటుంబానికి చెందిన వారిద్దరూ విద్యావంతులు. వీరిద్దరూ 3 జనవరి 1994న వివాహం చేసుకున్నారు. అమెరికాలో వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. అయితే కొన్నాళ్లకు భార్యాభర్తల మధ్య విబేధాలు రావడంతో 2005లో ముంబైకి తిరిగి వచ్చారు. గొడవల కారణంగా భర్తకు దూరమైన భార్య పుట్టింటికి వచ్చి తల్లితో ఇంట్లో ఉంటోంది. అనంతరం భర్త 2014లో మళ్లీ అమెరికాకు వెళ్లాడు. భార్యకు విడాకులు ఇస్తూ 2017లో అమెరికా నుంచి నోటీసులు పంపాడు. భారతదేశంలో ఉన్న భార్య ముంబై కోర్టులో అతడిపై గృహహింస కేసు పెట్టింది. 2018లో వారిద్దరికీ అమెరికా కోర్టు విడాకులు జారీ చేసింది. ఆ విడాకులను అంగీకరించని ఆమె ముంబై కోర్టులో భర్తపై సుదీర్ఘ విచారణ చేసింది.
Also Read: Nikhil Chaudhary: వివాదంలో చిక్కుకున్న క్రికెటర్... కారులోనే అత్యాచారం చేశాడని మహిళ ఆరోపణలు
విచారణలో భార్య ఆసక్తికర విషయాలు తెలిపింది. భర్త వలన మానసిక వేధింపులు, హింసకు గురైనట్లు భార్య ముంబై కోర్టులో వాదించింది. ఆమె వాదన విన్న ఆ కోర్టు 2017లో కీలక తీర్పు ఇచ్చింది. 'భార్యకు నెలనెలా రూ.1.50 లక్షల భరణం' ఇవ్వాలని తీర్పునిచ్చింది. దీంతోపాటు మరొక విషయంలో కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. 'సెకండ్ హ్యాండ్ అంటూ తనను వేధిస్తున్నారని భార్య వాదించింది. ఇలా మానసిక వేదనకు గురి చేసిన కారణంగా భార్యకు రూ.3 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై భర్త అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశాడు. సెషన్స్ కోర్టు, ముంబై హైకోర్టులో భార్యకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. దిగువ కోర్టులు ఇచ్చిన రూ.3 కోట్ల తీర్పును ముంబై హైకోర్టు సమర్ధించింది. ఆమెకు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది.
అసలు ఏం జరిగింది?
అతడితో పెళ్లికి ముందు ఆమెకు ఒకరితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఇతర కారణాలతో ఆ సంబంధం రద్దయ్యింది. తర్వాతి ప్రస్తుత భర్తతో పెళ్లయ్యింది. వివాహమైన కొన్ని రోజుల వరకు బాగానే ఉన్న కాపురం తర్వాత మనస్ఫర్ధలు వచ్చాయి. ఈ సమయంలో నిశ్చితార్థం విషయమై స్పందిస్తూ.. 'సెకండ్ హ్యాండ్ భార్య' అని పిలుస్తూ ఆమెను అవమానిస్తున్నాడు. తరచూ సెకండ్ హ్యాండ్ అంటూ సూటిపోటీ మాటలతో వేధిస్తుండడంతో భార్య న్యాయపోరాటం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలపై దిగువ, ఉన్నత న్యాయస్థానాలన్నీ తప్పుబట్టింది. భార్యత ఆత్మగౌరవం దెబ్బతీసే అధికారం భర్తకు లేదని న్యాయస్థానాలు స్పష్టం చేశాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook