Metro Man Sreedharan: బీజేపీలో చేరిన మెట్రో మ్యాన్ శ్రీధరన్, Kerala రాజకీయాలు మారనున్నాయా

Metro Man Sreedharan Joins BJP: కేర‌ళ బీజేపీ అధ్యక్షుడు కె సురేంద్రన్ స‌మ‌క్షంలో తన స్వస్థలం మళ్లాపురంలో శ్రీధరన్ బీజేపీలో చేరారు. శ్రీధరన్‌ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మ‌రో రెండు నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నుండటంతో కేరళ ఎన్నికలు వేడెక్కుతున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 26, 2021, 12:48 PM IST
  • మెట్రోమ్యాన్‌గా ప్రసిద్ధి గాంచిన ఈ శ్రీధ‌ర‌న్ భారతీయ జనతా పార్టీలో చేరారు
  • విజ‌య్ యాత్రలో భాగంగా శ్రీధరన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు
  • కేర‌ళ బీజేపీ అధ్యక్షుడు కె సురేంద్రన్ స‌మ‌క్షంలో బీజేపీలో చేరారు
Metro Man Sreedharan: బీజేపీలో చేరిన మెట్రో మ్యాన్ శ్రీధరన్, Kerala రాజకీయాలు మారనున్నాయా

Metro Man Sreedharan Joins BJP: కేర‌ళ‌కు చెందిన ప్రముఖ వ్యక్తి, మెట్రోమ్యాన్‌గా ప్రసిద్ధి గాంచిన ఈ శ్రీధ‌ర‌న్ భారతీయ జనతా పార్టీ(BJP)లో చేరారు. బీజేపీ నేత నిర్వహిస్తున్న విజ‌య్ యాత్రలో భాగంగా శ్రీధరన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొన్నిరోజులుగా తన రాజకీయ అరంగేట్రంపై సమాచారం ఇస్తూనే ఉన్న మెట్రో మ్యాన్ చెప్పినట్లుగానే బీజేపీ కండువా కప్పుకున్నారు.

కేర‌ళ బీజేపీ అధ్యక్షుడు కె సురేంద్రన్ స‌మ‌క్షంలో తన స్వస్థలం మళ్లాపురంలో శ్రీధరన్ బీజేపీలో చేరారు. శ్రీధరన్(Metro Man Sreedharan)‌ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మ‌రో రెండు నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నుండటంతో కేరళ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. రాజకీయ అరంగేట్రానికి ముందే లవ్ జిహాద్(Love Jihad) లాంటి వివాదాస్పద అంశాలపై వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బలవంతుపు పెళ్లిళ్లు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: 7th Pay Commission: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, తెలంగాణ తరహాలోనే కీలక నిర్ణయం

గత 10ఏళ్లుగా కేరళలోనే ఉంటున్నానని, పలు ప్రభుత్వాల పనితీరును తాను గమనించానని 88 ఏళ్ల శ్రీధరన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీ(BJP) తనకు వేదికగా కనిపించిందన్నారు. అవసరమైతే ఎన్నికల బరిలో దిగి పోటీ చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పూర్తిగా వైఫ్యలం చెందారని అభిప్రాయపడ్డారు.

Also Read: Nirav modi: ఆర్ధిక నేరగాడు నీరవ్ మోదీ త్వరలో ఇండియాకు, అంగీకరించిన లండన్ న్యాయస్థానం

ప్రభుత్వంలో కేవలం కొందరు మాత్రమే మాట్లాడే స్వేచ్ఛ కలిగి ఉన్నారని, నియంత పాలన కొనసాగుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన శ్రీధరన్ ఎన్నికల్లో పోటీ చేసి సీఎం పదవి అలంకరించేందుకు సైతం తాను సిద్ధమని సంకేతాలిచ్చారు. మరోవైపు వయసు పైబడిన నేతలకు బీజేపీ కీలక పదవులు కట్టబెడుతుండేమో కానీ, ఎన్నికల బరిలో నిలపడం అసాధ్యమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Also Read: EPFO: మరోసారి తగ్గనున్న PF Interest Rate, మోదీ ప్రభుత్వంలో వడ్డీ రేట్లు ఇలా మారాయి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News