Modi @ 20 Years Book Contents: ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద్భంగా దేశంలోని విభిన్న రంగాల ప్రముఖుల విశ్లేషణలతో రూపొందించిన " మోదీ @ 20 ఏళ్లు " పుస్తకాన్ని రాష్ట్రంలోని విద్యావేత్తలతోపాటు ప్రముఖులకు అందజేయాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గురువారం సాయంత్రం కరీంనగర్ హౌజింగ్ బోర్డు కాలనీలోని రిటైర్డ్ ప్రిన్సిపాల్, రచయిత దాస్యం సేనాధిపతికి పుస్తక తొలి ప్రతిని అందజేశారు. తన పార్లమెంట్ పరిధిలోని రిటైర్డ్ హెడ్మాస్టర్లు, ప్రినిపాల్స్, విద్యావేత్తలతోపాటు ప్రముఖులకు ఈ పుస్తకాలను అందించాలని, అలాగే అన్ని గ్రంథాలయాల్లోనూ ఈ పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. తద్వారా మోదీ పాలన ఫలితాలను ప్రజలకు అర్ధమయ్యేలా చేయడమే ఈ పుస్తక ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు.
" కష్టపడే తత్వం, సేవ చేయాలనే సంకల్పం, పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలుం ఉంటే చాలు... పేద, ధనిక అనే తేడా లేకుండా భారత ప్రధాన మంత్రి కాగలరని నిరూపించడమే కాకుండా భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ " అని బండి సంజయ్ కొనియాడారు.
" బీజేపీ ఎంత గొప్ప పార్టీ అంటే... సిద్ధాంతాలను నమ్ముకుని, కష్టపడి ప్రజలకు సేవ చేయాలనుకునే వారిని గుర్తించి గౌరవించే ఏకైక పార్టీ బీజేపి. మోదీ ఇందుకు నిదర్శనం. పార్టీ కోసం, ప్రజల కోసం, ధర్మం కోసం మోదీ చేస్తున్న సేవలను గుర్తించి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా అవకాశమిచ్చింది " అని పేర్కొన్నారు. " బీజేపీ నమ్మకాన్ని ఏనాడూ వమ్ముచేయని మోదీ అభివృద్ధిలో గుజరాత్‌ను దేశానికే మోడల్‌గా తీర్చిదిద్డడమే కాకుండా ప్రధానిగా దేశాన్ని అగ్రపథంలోకి తీసుకెళుతున్నారు" అని బండి సంజయ్ తెలిపారు.
" ప్రధానమంత్రిగా, అంతకు ముందు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి గత అక్టోబర్ 7 నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ గత 20 ఏళ్లలో సాధించిన విజయాలు, దేశం సాధించిన ప్రగతి ఏ విధంగా ఉందనే విషయాన్ని " మోదీ @ 20 ఏళ్లు " ఈ పుస్తకంలో వెల్లడించారు. ఈ పుస్తకాన్ని రాసినవాళ్లెవరూ బీజేపీ వాళ్లో, మోదీ అభిమానులో కాదు. ఆధార్ కార్డు రూపశిల్పి నందన్ నీలేఖని, ప్రఖ్యాత డాక్టర్ దేవిశెట్టి, స్వచ్ఛంద సేవకురాలు ఇన్ఫోసిస్ సుధాx మూర్తి, సాంస్కృతిక రాయబారి అమిత్ త్రిపాఠితోపాటు తెలుగు వారైన పీవీ సింధు, శోభనా కామినేని వంటి భిన్న రంగాలకు చెందిన ప్రముఖుల విశ్లేషణలతో రూపొందించిన పుస్తకమిది’’అని పేర్కొన్నారు.
"2004 – 2014 నుండి యూపీఏ హయాంలో అన్నీ అవినీతి కుంభకోణాలే. 2జీ, స్ప్రెక్టం, సహారా, ఈపీఎఫ్, బొగ్గు స్కాంలెన్నో... విదేశాల్లో భారతీయులు ఇక్కడ జరుగుతున్న అవినీతిని, ఆర్దిక సంక్షోభాన్ని చూసి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. మోదీ వచ్చాక పరిస్థితినే మార్చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి సురక్షితంగా బయటపడేశారు. కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్దం ప్రపంచాన్ని గడగడలాడిస్తే.... ఆ ప్రపంచానికే భారత్ ను వెలుగు దివ్వెగా మార్చి విశ్వగురుగా ఆవిష్కరించే స్థితికి తీసుకొచ్చారు" అని కొనియాడారు. "నేషన్ ఫస్ట్ - పార్టీ నెక్స్ట్ – ఫ్యామిలీ లాస్ట్ అనే బీజేపీ సిద్ధాంతాన్ని నరనరాన పుణికి పుచ్చుకున్న ఉక్కు సంకల్పం నరేంద్రమోదీదే. ఆయన స్పూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేస్తే భారతదేశాన్ని ఎవరూ ఆపలేరన్న సందేశం ఈ పుస్తకాన్ని చదివితే అర్ధమవుతుంది" అని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి : KTR's Open Letter to Centre: కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ.. విషయం ఏంటంటే..
ఇది కూడా చదవండి : Ram Navami 2023: రాముల వారి కళ్యాణానికి కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు.. ముఖ్యమంత్రికి వీహెచ్‌పీ సూటి ప్రశ్న
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK