Love jihad: మతం మార్చితే...పదేళ్లు జైలుకే

Love jihad: లవ్ జిహాద్..ఇటీవల చర్చనీయాంశంగా మారిన అంశం. లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం సైతం చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బిల్లును రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది.

Last Updated : Dec 26, 2020, 01:09 PM IST
Love jihad: మతం మార్చితే...పదేళ్లు జైలుకే

Love jihad: లవ్ జిహాద్..ఇటీవల చర్చనీయాంశంగా మారిన అంశం. లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం సైతం చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బిల్లును రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది.

ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని మతమార్పిడులకు పాల్పడుతుండటాన్ని లవ్ జీహాద్ ( Love jihad ) ‌గా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు లవ్ జిహాద్ ( Love jihad ) ‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చాయి. ఇప్పుడు మరో రాష్ట్రం ఆ బాట పట్టింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం బలవంతపు మతమార్పిడులను అరికట్టేందుకు ధర్మ స్వాతంత్య్ర బిల్లు 2020 అంటే మతస్వేచ్ఛ బిల్లును మధ్యప్రదేశ్ కేబినెట్ ( Madhya pradesh cabinet ) ఆమోదించింది.

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ( Cm Shivraj singh chauhan ) అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కేబినెట్‌లో ఈ బిల్లును ఆమోదించారు. కొత్త బిల్లుతో షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన మైనర్, మహిళల్ని బలవంతంగా మతం మార్చితే..50 వేల జరిమానాతో పాటు పది సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నారు. ఒకరిని మతమార్పిడి కోసం బలవతం చేస్తే 1-5 సంవత్సరాల జైలు శిక్ష, 25 వేల రూపాయల జరిమానా విధిస్తారు. ప్రభుత్వం అందరిదనీ..అన్ని మతాలకు , కులాలకు చెందినదన్నారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. 

Also read: Kerala: రాజధాని మేయర్‌గా డిగ్రీ విద్యార్ధిని..దేశంలో సరికొత్త రికార్డు

Trending News