RLP chief, MP Hanuman Beniwal shows Covid-19 reports on Twitter: న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ( Parliament monsoon session ) నేపథ్యంలో లోకసభ, రాజ్యసభ సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో దాదాపు 20 మందికిపైగా ఎంపీలకు కరోనా (Coronavirus) పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అయితే ఈ పరీక్షలు చేయించుకోని పాజిటివ్‌గా తేలిన వారిలో రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీకి చెందిన జాతీయ కన్వీనర్, రాజస్థాన్‌కు చెందిన ఎంపీ హనుమాన్ బేనివాల్ (Hanuman Beniwal) కూడా ఉన్నారు. అయితే ఆయనకు వింత పరిస్థితి ఎదురైంది. 11న పార్లమెంట్ హౌస్‌లో టెస్ట్ చేయించుకోగా.. బేనివాల్‌కు కరోనా పాజిటివ్ రాగా.. 13న జైపూర్‌లో టెస్ట్ చేయించుకోగా.. నెగిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఆయోమయానికి గురయ్యారు. అసలు కరోనా వచ్చిందా.. లేక రాలేదా...? ఏ రిపోర్టు ఖచ్చితమైనదంటూ కాపీలతో హనుమాన్ బేనివాల్ ట్విట్ చేశారు.
मैंने लोकसभा परिसर में #Covid19 की जांच करवाई जो पॉजिटिव आई उसके बाद जयपुर स्थित SMS मेडिकल में जांच करवाई जो नेगेटिव आई,दोनों रिपोर्ट आपके साथ साझा कर रहा हूँ,आखिर किस रिपोर्ट को सही माना जाए ? pic.twitter.com/6NgU0jBdWE
— HANUMAN BENIWAL (@hanumanbeniwal) September 14, 2020
లోక్‌సభ వద్ద చేసిన పరీక్షలో నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ తరువాత జైపూర్‌లోని ఎస్‌ఎమ్ఎస్ మెడికల్‌లో నెగెటివ్ వచ్చింది. ఈ రెండు రిపోర్టులను మీతో పంచుకుంటున్నాను.. ఏ రిపోర్టు సరైనదిగా పరిగణించాలంటూ ఆయన ట్విట్ చేశారు. అయితే.. స్వయంగా ఓ ఎంపీకే ఇలాంటి సమస్య ఎదురవ్వడంతో కరోనా పరీక్షలపై ప్రస్తుతం పలు సందేహాలు తలెత్తుతున్నాయి. Also read: శశికళ విడుదలెప్పుడో తెలుసా..స్పష్టం చేసిన బెంగుళూరు సెంట్రల్ జైలు