Dr Bomb Arrested: ముంబై పేలుళ్ల సూత్రధారి ‘డాక్టర్ బాంబ్’ అరెస్ట్

పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చి కనిపించకుండాపోయిన ముంబై వరుస బాంబు పేలుళ్ల సూత్రధారి ‘డాక్టర్ బాంబ్’ జలీస్‌ అన్సారీ(68) మళ్లీ అరెస్టయ్యాడు. గురువారం నుంచి తప్పించుకు తిరుగుతున్న అన్సారీని ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

Last Updated : Jan 17, 2020, 08:25 PM IST
Dr Bomb Arrested: ముంబై పేలుళ్ల సూత్రధారి ‘డాక్టర్ బాంబ్’ అరెస్ట్

ముంబై: పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చి కనిపించకుండాపోయిన ముంబై వరుస బాంబు పేలుళ్ల సూత్రధారి ‘డాక్టర్ బాంబ్’ జలీస్‌ అన్సారీ(68) మళ్లీ అరెస్టయ్యాడు. గురువారం నుంచి తప్పించుకు తిరుగుతున్న అన్సారీని ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కాన్పూర్‌లోని ఓ మసీదు నుంచి బయటకు వస్తున్న అన్సారీని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లక్నోకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

యూపీ పోలీసు ఉన్నతాధికారి ఓపీ సింగ్ మీడియాతో మాట్లాడారు. ‘1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన అన్సారీ నిన్నటి నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. దీనిపై అతడి కుమారుడు ఫిర్యాదు చేశాడు. ఓ మసీదు నుంచి బయటకు వస్తుండగా అతడ్ని అదుపులోకి తీసుకున్నాం. యూపీ పోలీసుల బిగ్ అచివ్ మెంట్ ఇది. అన్సారీ యూపీలోని సంత్ కబిర్ నగర్ జిల్లాకు చెందినవాడు. ఎంబీబీఎస్ చదివాడు. నేపాల్ మార్గం గుండా దేశం వదిలివెళ్లాలని అతడు ప్లాన్ చేసి ఉండొచ్చు. మూడు వారాల పెరోల్‌పై ఉన్న అన్సారీ ముంబైలోని అగ్రిపడ పోలీస్ స్టేషన్లో ప్రతిరోజూ హాజరు కావాల్సి ఉంది. కానీ జనవరి 16 నుంచి అతడి ఆచూకీ లేదని’ వివరించారు.

Also Read: పెరోల్‌పై వచ్చిన 1993 ముంబై వరుస పేలుళ్ల దోషి మిస్సింగ్

ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషి అయిన జలీస్ అన్సారీ అగ్రిపడలోని మోమిన్‌పురాలో నివాసం ఉంటున్నాడు. కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న అన్సారీ 21 రోజుల పెరోల్ మీద రిలీజ్ అయ్యాడు. కానీ గురువారం నుంచి అన్సారీ పీఎస్‌కు రావడం లేదు. అదే సమయంలో తన తండ్రి కనిపించడం లేదని అతడి కుమారుడు జైద్ అన్సారీ ఫిర్యాదు చేయడంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇతర రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో యూపీలోని కాన్పూర్‌లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అన్సారీని అదుపులోకి తీసుకున్నారు. ముంబై సహా మరో 50వరకు బాంబు పేలుళ్ల కేసులో అన్సారీ సూత్రధారిగా ఉన్నాడు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News