రాహుల్ ఆ పని చేయడం చూసి ఆశ్చర్యపోయాను: నరేంద్ర మోదీ

పార్లమెంటులో అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

Last Updated : Jul 21, 2018, 04:58 PM IST
రాహుల్ ఆ పని చేయడం చూసి ఆశ్చర్యపోయాను: నరేంద్ర మోదీ

పార్లమెంటులో అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తొలుత సభను ఓపికగా నడిపిన స్పీకరుకి ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపిన మోదీ.. అవిశ్వాస తీర్మానం అనేది మన ప్రజాస్వామ్య బలమని అన్నారు. రాజకీయాలు భారతదేశంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో అందరూ తెలుసుకోవడానికి ఈ రోజు ఈ తీర్మానం మంచి అవకాశం కల్పించిందని మోదీ తెలిపారు.

నెగెటివ్ పాలిటిక్స్ అనేవి ప్రజలను చుట్టుముడుతున్నాయని.. వారు జాగరూపులై వ్యవహరించాలని మోదీ అన్నారు. అలాగే హఠాత్తుగా రాహుల్ గాంధీ వచ్చి తనను కౌగలించుకున్న విషయం మీద కూడా మోదీ స్పందించారు. ఆయన ఎందుకు అంత గాభరాగా తన వద్దకు వచ్చి హత్తుకున్నారో తనకు అర్థం కాలేదని.. తాను ఆశ్చర్యపోయానని చెబుతూ.. ప్రజాస్వామ్యంలో నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తుందని.. గాభరా పడినంత మాత్రాన పనులు జరగవని అన్నారు. 

"ఈ ఫ్లోర్ టెస్టు ప్రభుత్వానికి కాదు. కాంగ్రెస్ పార్టీకి మరియు వారిని అనుసరించేవారికే ఈ పరీక్ష. మాకు ఇక్కడ సంఖ్యా బలం ఉంది. అలాగే 1.25 కోట్ల జనాభా ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఓటు బ్యాంకు గురించి కూడా భయపడకుండా.. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అనే నినాదంతో 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం" అని ప్రధాని మోదీ అన్నారు. 2022 సంవత్సరం నాటికి రైతులకు ఆదాయం డబుల్ అవ్వాలని ఆశిస్తున్న ప్రభుత్వం తమదే అని మోదీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అనుకున్నంత అభివృద్ది జరగకపోవడానికి కారణం గత ప్రభుత్వాలే అని తెలిపారు. 

Trending News