మోదీ సర్కార్‌పై విరుచుకుపడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

మోదీ సర్కార్‌పై విరుచుకుపడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

Last Updated : Sep 1, 2019, 07:54 PM IST
మోదీ సర్కార్‌పై విరుచుకుపడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

ఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కార్‌పై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్‌ను ఆర్థిక మాంద్యం ముంచేస్తోందన్న మన్మోహన్ సింగ్.. ప్రధాని మోదీ అసమర్ధత వల్లే దేశంలో ఆర్థికమాంద్యం ఏర్పడిందన్నారు. పాత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి పరిణామాలు దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని మండిపడ్డారు. భారత్‌లో ఆర్థికాభివృద్ధి మందగించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారత్ అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

 

ఈ సందర్భంగా మోదీ సర్కార్ వైఫల్యాలను వేలెత్తి చూపిన మన్మోహన్ సింగ్.. భారత ఆటోమొబైల్‌ రంగంలో 3.5లక్షల మంది ఉపాధి కోల్పోయారని గుర్తుచేశారు. ఇకనైనా మోదీ కక్షసాధింపు రాజకీయాలు మానుకుని ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారించాలని మన్మోహన్ సింగ్ హితవు పలికారు. దేశంలో పలు ఆర్థిక సంస్కరణలకు స్వీకారం చుట్టిన ఆర్థికవేత్తగా పేరున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపై మోదీ సర్కార్ ఏమని స్పందిస్తుందో మరి.

Trending News