నవ్‌జ్యోత్ సింగ్‌కి మూడేళ్లు జైలు శిక్ష విధించాల్సిందేనన్న సొంత ప్రభుత్వం

 పంజాబ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకి రాష్ట్రంలో అధికారంలో వున్న సొంత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే అనుకోని షాక్ తగిలింది. 

Last Updated : Apr 13, 2018, 01:55 PM IST
నవ్‌జ్యోత్ సింగ్‌కి మూడేళ్లు జైలు శిక్ష విధించాల్సిందేనన్న సొంత ప్రభుత్వం

టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత పంజాబ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకి రాష్ట్రంలో అధికారంలో వున్న సొంత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే అనుకోని షాక్ తగిలింది. 1988లో డిసెంబర్ 27న పటియాలలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం నేపథ్యంలో సిద్ధూకు గుర్నామ్ సింగ్ అనే 65 ఏళ్ల వృద్ధుడికి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో సిద్ధూ ఆ వృద్ధుడి తలపై బలంగా బాదడంతో ఆ వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడనేది అతడిపై నమోదైన అభియోగం. ఈ కేసులో ఆయనను దోషిగా నిర్ధారించాలంటూ పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. రోడ్డు ప్రమాదం కేసులో తన ప్రమేయం లేదని, గుండెపోటు కారణంగానే గుర్నాం సింగ్ చనిపోయాడని సిద్ధూ ఇచ్చిన వాగ్మూలంలో వాస్తవం లేదని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దిగువ కోర్టు ఆయనను విడిచిపెట్టినప్పటికీ... పంజాబ్-హర్యానా హైకోర్టు ఆ తీర్పును కొట్టేస్తూ ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ 2 కింద సిద్ధూని దోషిగా తేల్చింది. 

అప్పట్లో బెయిల్‌పై బయటికొచ్చిన సిద్ధూకి జైలు శిక్షను పెంచాల్సిందిగా బాధితుడి కుటుంబసభ్యులు కోరగా.. అతడికి మూడేళ్ల జైలు శిక్షనే ఖరారు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర సర్కార్ సుప్రీం కోర్టుకు నివేదించింది. సిద్ధూ తమ కేబినెట్‌లో మంత్రిగా వున్నప్పటికీ.. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో సిద్ధూకి మూడేళ్ల జైలు శిక్ష విధించాల్సిందిగా కోరడం తప్ప పంజాబ్ సర్కార్ ముందు మరో మార్గం లేకపోయింది. 

Trending News