Sarkari Jobs 2020: ప్రభుత్వ ఉద్యోగం ( Government Jobs 2020) కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT ) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. నాన్ టీచింగ్ ( Non Teaching Jobs ) విభాగంలో మొత్తం 266 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీని కోసం అభ్యర్థులను ఇంటర్య్వూ చేసి ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆగస్టు 3 లోపు ncert.nic.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. Also Read : Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు
NCERT Recruitment 2020 Details : ఎన్‌సీఈఆర్టీలో పలు పోస్టుల వివరాలు
266 పోస్టుల్లో 142 పోస్టులు అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పోస్టులు కాగా, 83 పోస్టులు అసోసియేట్ ప్రొఫేసర్ పోస్టులు , 38 ప్రొఫెసర్ పోస్టులు, 2 అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
అర్హతలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోషియేష్ ప్రొఫెసర్, ప్రోఫెసర్ పోస్టు కోసం అభ్యర్థులు సంబంధిత అంశంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ డిగ్రీ అవసరం ఉంటుంది.
లైబ్రేరియన్: లైబ్రేరి సైన్స్/ ఇన్ఫెర్మేషన్ సైన్స్/డాక్యుమెంటేషన్ సైన్స్‌లో సుమారు 55 శాతం ఉన్న మాస్టర్ డిగ్రీ ఉండాలి. దాంతో పాటు 10 సంవత్సరాల అనుభవం అవసరం.
అసిస్టెంట్ లైబ్రేరియన్: ఇన్ఫెర్మేషన్ సైన్స్/ లైబ్రేరి సైన్స్ / డాక్యుమెంటేషన్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ/ సుమారు 55 శాతం మార్కులు ఉండాలి. సంబంధిత విషయంలో నెట్ పూర్తి చేసి ఉండాలి
దరఖాస్తు రుసుము
జనరల్, ఓబీసి లేదా ఈడబ్ల్యూఎస్-రూ.1000
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ- ఎలాంటి ఫీజు లేదు
మరిన్ని వివరాల కోసం ncert.nic.in విజిట్ చేయండి.
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
మరిన్ని ఉద్యోగ అవకాశాల కోసం: