అనుమానంతో పొరిగింటి మహిళను హతమార్చాడు!

మహిళపై (Black Magic) అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హతమార్చాడు. స్థానికులు పోలీసులను సమాచారం ఇవ్వగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు చెప్పిన సమాధానం విని పోలీసులు షాకయ్యారు.

Last Updated : Jul 30, 2020, 04:39 PM IST
అనుమానంతో పొరిగింటి మహిళను హతమార్చాడు!

పొరిగింటి మహిళపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హతమార్చాడు. మహారాష్ట్ర, థానే జిల్లిలోని ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. హత్య విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన స్థానికులు పోలీసులను సమాచారం ఇవ్వగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు చెప్పిన సమాధానం విని పోలీసులు షాకయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. కల్యాణ్ తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్తి గ్రామంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. 8 రోజుల కిందట ఆ వ్యక్తి భార్య అనారోగ్యంతో చనిపోయింది. Ram Temple: పూజారి సహా 15 మందికి కరోనా పాజిటివ్

అయితే తన పొరుగింటి మహిళ మంత్రగత్తె అయి ఉంటుందని అనుమానించాడు. ఆమె చేతబడి చేసి తన భార్యను చంపి ఉంటుందని భావించాడు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం మంగళవారం సాయంత్రం మహిళపై కత్తితో దాడి చేశాడు. కత్తిపోట్లతో మహిళ కుప్పకూలగా నిందితుడు(35) పరారయ్యాడు. మరుసటి రోజు స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు.  IPL ఫైనల్ తేదీ మార్పు.. 13 ఏళ్లలో తొలిసారిగా!

ఐపీసీ సెక్షన్ 302 కింద హత్య కేసు న‌మోదు చేసిన పోలీసులు బుధవారం నాడు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చేతబడి చేసి తన భార్యను చంపినందునే ఆమెను హత్య చేశానని పోలీసుల విచారణలో వెల్లడించాడు. వీరి కుటుంబాల మధ్య భూ తగాదాలున్నాయని, ఆ కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. Photos: బుల్లితెర రారాణి అంకితా లోఖాండే..    

వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

Trending News