Drona Attach in Jammu: జమ్ముకశ్మీర్ వైమానిక స్థావరంపై జరిగిన దాడిని కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంది. కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది.
జమ్ములోని వైమానిక స్థావరంపై (Jammu Military Base)ఈ నెల 27వ తేదీన జరిగిన బాంబు దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. వైమానిక స్థావరాలపై భద్రతపై ప్రశ్నలు రేపింది. బాంబుదాడిలో భారీ ఎత్తున నష్టం లేకపోయినా భద్రతా వైఫల్యం, భద్రతా సామర్ధ్యంపై ప్రశ్నలు రేకెత్తాయి.ఈ నెల 27 వ తేదీ అర్ధరాత్రి 1.40 నిమిషాల సమయంలో తక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చిన రెండు ద్రోన్‌లు ఆరు నిమిషాల వ్యవధిలో ఐఈడీ పేలుడు పదార్ధాల్ని జార విడిచాయి.తొలి బాంబు దాడిలో సత్వారీ ఏరియాలోని హై సెక్యూరిటీ టెక్నికల్ ఏరియాలోని ఓ బిల్డింగ్ పైకప్పు దెబ్బతినగా..రెండవ దాడి బహిరంగ ప్రదేశంలో జరిగింది.ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం(Central government)సీరియస్‌గా తీసుకుంది.కేసు విచారణను ఎన్ఐఏకు(NIA)అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.గతంలో అంటే 2002లో కూడా ఇదే స్థావరంపై దాడి జరిగింది. అప్పట్లో 10 మంది చిన్నారులు సహా 31 మంది మృతి చెందారు. జమ్ములోని వాయుసేన స్థావరంపై రెండు ద్రోన్లతో దాడి (Drone Attack)జరిగిందని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ఒక్కొక్క ద్రోన్ 2 కిలోల చొప్పున శక్తివంతమైన ఐఈడీలను మోసుకొచ్చాయి.ఈ దాడి వెనుక జైష్ ఎ మొహమ్మద్ (Jaish e mohammad)ఉండవచ్చని అనుమానాలున్నాయి.
Also read: Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు, ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook