Night curfew in Gujarat: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో (Corona in India) వివిధ రాష్ట్రాలు కఠిన ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధించడం, విద్యా సంస్థలకు సెలవలు ప్రకటించడం వంటి చర్యలు చేపట్టాయి. ఇప్పుడు ఆ జాబితాలో గుజరాత్ కూడా (Corona restirictions in Gujarat) చేరింది.
గుజరాత్లో జనవరి 7 (శుక్రవారం) నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఆహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, గాంధీనగర్, జునాగడ్, జామ్‌నగర్, భావ్‌నగర్, ఆనంద్, నడియాద్ పట్టణాల్లో ఈ ఆంక్షలు (Night curfew imposed in Gujarat ) విధింంది ప్రభుత్వం.
ముఖ్యమంత్రి కార్యాలయం వెలువరించిన ప్రకటనలో.. అన్ని రాజకీయ, సామాజిక కార్యక్రమాలు, పెళ్లిళ్లకు గరిష్ఠంగా 400 మందికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్లలో 50 శాతం కెపాసిటీతో వేడుకలు జరుపుకోవాలని (Corona rules in Gujarat) సూచించింది. అత్యక్రియల్లో పాల్గొనేవారి సంఖ్యను 100గా నిర్ణయించింది.
వ్యాపార సముదాయాలపై ఆంక్షలు ఇలా..
రాష్ట్ర వ్యవ్యాప్తంగా షాపింగ్ కాంప్లెక్స్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, 75 శాతం కెపాసిటితో పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఇందుకు అనుమతి ఉంటుందని పేర్కొంది.
ప్రభుత్వ, ప్రైవేటు నాన్ ఏసీ, ఏసీ బస్సులు 75 శాతం కెపాసిటీతో నడవాలని సూచించింది.
సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌కు 50 శాతం కెపాసిటీతో నడిచేందుకు అనుమతినిచ్చింది.
ఇక విద్యా సంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు (Educational institutions closed in Gujarat) ప్రకటించింది. గుజరాత్ హై కోర్టు సైతం వర్చువల్‌గానే కేసులను విచారించనుంది.
రాష్ట్ర ఆరోగ్య శాఖ డేటా ప్రకారం.. రాష్ట్రంలో శుక్రవారం నాటికి 14,346 కరోనా యాక్టివ్ కేసులు (Corona active cases in Gujarat) ఉన్నాయి.
Also read: Weekend Curfew: ఢిల్లీ, కర్ణాటకల్లో నేటి నుంచి వీకెండ్ కర్ఫ్యూ.. అమలులోకి ఈ నిబంధనలు..
Also read: Ahmedabad IIM Report: దేశంలో కరోనా మరణాలు 32 లక్షలకు పైనే.. సంచలనం రేపుతున్న సర్వే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook