హైదరాబాద్: భారతదేశంలో బుధవారం కొత్తగా కరోనావైరస్ పాజిటివ్ బాధితుల సంఖ్య 28కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ తెలిపారు. ఈ సంఖ్య పెరగడంతో, కోవిడ్ -19 వ్యాప్తికి ప్రత్యామ్నాయంగా ముందుజాగ్రత్త చర్యగా అన్ని దేశాల నుండి భారత్ కు వచ్చే ప్రయాణికులను పరీక్షించనుందని అన్నారు.
'కరోనావైరస్' వంటి ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో తాను ఎలాంటి హోలీ మిలన్ కార్యక్రమాల్లో పాల్గొనబోనని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. వైద్య నిపుణుల సలహా మేరకు సామూహిక సమావేశాలకు హాజరుకాబోనని ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనావైరస్ బారిన పడి 3,248 మందికి పైగా మరణించారని, ఇందులో అత్యధికంగా 2,981 మంది చైనాలో మరణించారు. 90,000 మందికి పైగా పాజిటివ్ గా తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
కరోనా వైరస్ పై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. 'హ్యాండ్‌షేక్‌కు బదులుగా నమస్తే చేయండని, ఈ పరిస్థితుల్లో గ్రీటింగ్ అలవాట్లను మార్చుకోవాలని కోరారు. సాధారణ హ్యాండ్‌షేక్‌కు బదులుగా ప్రాణాంతకమైన కరోనావైరస్ వ్యాప్తిని నివారించే చర్యలలో ఒకటిగా అవలంబించాలని ఆయన ప్రోత్సహించినట్లు ప్రెస్ ట్రస్ట్ అఫ్ ఇండియా పేర్కొంది.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..