ప్రధాని మోదీపై నటుడు ప్రకాష్‌రాజ్ ఆగ్రహం

భారత ప్రధాని నరేంద్ర మోదీపై నటుడు ప్రకాష్ రాజ్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిన్న బెంగళూరు వచ్చి ప్రసంగించిన మోదీ మాటల వల్ల ఆ రాష్ట్రంలో రైతులకు, యువతకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

Last Updated : Feb 5, 2018, 11:03 AM IST
ప్రధాని మోదీపై నటుడు ప్రకాష్‌రాజ్ ఆగ్రహం

భారత ప్రధాని నరేంద్ర మోదీపై నటుడు ప్రకాష్ రాజ్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిన్న బెంగళూరు వచ్చి ప్రసంగించిన మోదీ మాటల వల్ల ఆ రాష్ట్రంలో రైతులకు, యువతకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. 2014లో కూడా ఇలాంటి టూత్ పేస్ట్ ప్రామిస్‌లే మోదీ చేశారని.. అయినా ఆయనను ప్రజలు నమ్మలేదని ప్రకాష్ రాజ్ తెలిపారు.

ఇప్పుడు చేసిన ప్రామిస్‌లు కూడా ప్రజలు నమ్ముతారని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. ప్రజల మొహాల్లో ఎలాగోలా నవ్వును చూడడానికి మోదీ టూత్ పేస్టు ప్రామిస్‌లు చేస్తుంటారని.. అయితే అవి రైతులకు, నిరుద్యోగుల మొహాల్లో ఎలాంటి నవ్వును పూయించవని.. ఆ విషయం మోదీ అర్థం చేసుకోవాలని ప్రకాష్ రాజ్ తెలిపారు.

నిన్న బెంగళూరులో జరిగిన సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పై మాటల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఎడ్యూరప్ప హయంలోనే మళ్లీ కర్ణాటకకు మంచి రోజులు వస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. జనాలను వంచించడానికే కర్ణాటకలో కాంగ్రెస్ పావులు కదుపుతుందని మోదీ తెలిపారు. ఈ క్రమంలో ఈ రోజు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

గతంలో కూడా ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. "నన్ను బీజేపీ వాళ్ళు హిందూ వ్యతిరేకి అంటారు. కానీ నేను హిందూ వ్యతిరేకిని కాదు. నేను మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకిని. అలాగే అమిత్ షా మాటలకు వ్యతిరేకిని. అనంత్ కుమార్ హెగ్డే ఎప్పుడూ ఇజం అనే పదాన్ని తొలిగించడమే తన పని అని చెప్పుకుంటూ ఉంటారు. హిందుయిజంలో మాత్రం ఇజం లేదా.... ఆ పదాన్ని తొలిగిస్తానని అన్నవాడు హిందూ ఎలా అవుతాడు" అని ప్రకాష్ రాజ్ తెలిపిన సంగతి తెలిసిందే

Trending News